ఎన్టీఆర్ కు ఆ బ్లాక్ టీషర్ట్ ఎంతో స్పెషల్.. దాని రేటు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి విదేశాలలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. వారి ఫోటోలు కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అభిమానులకు మాత్రం ఆ ఫోటోలు ఫుల్ జోష్ ఇస్తూనే ఉన్నాయి. ఎన్టీఆర్ తన పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లకు కూడా సోషల్ మీడియాలో మంచి ఫాన్ ఫాలోయింగ్ ఏర్పడిందిది.

JR NTR Turns Agnyaathavaasi In U.S.A

ఈ బుల్లి నందమూరి హీరోల ఫ్యాన్స్ క్ల‌బ్‌ లో ఈ ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ లగ్జరీ లైఫ్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎన్టీఆర్ కి కార్లు అంటే ఎంతో ఇష్టం, మార్కెట్లోకి ఎటువంటి కొత్త కార్‌ వచ్చినా వెంటనే దానిని కొనుగోలు చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత చిత్ర పరిశ్రమలో ఉన్న తన స్నేహితులతో ఆ కార్‌లో రైడ్‌కు వెళ్తూ ఉంటాడు. ఖరీదైన వాచెస్ బైక్స్, బంగ్లాలు కూడా ఎన్టీఆర్‌ సొంతం.

ఎన్టీఆర్ డ్రెస్సింగ్‌ విషయంలో కూడా ఎంతో స్టైలిష్ గా ఉంటాడు. విదేశాలకు వెళ్ళాడు అంటే ఎంతో ఖరీదైన దుస్తులు కొనుగోలు చేస్తూ ఉంటాడు. త్రిబుల్ ఆర్ సినిమా ప్రమోషన్ లో ఎన్టీఆర్ వేసుకున్న డ్రెస్సులన్నీ విదేశాల్లో కొనుగోలు చేసినవే. తాజాగా ఇప్పుడు ఎన్టీఆర్.. ఓ బ్లాక్ హుడీలో ఎంతో స్టైలిష్ గా కనిపించాడు. రాల్ఫ్ లారాన్‌ అనే హుడి ధరించాడు. దీని ధర తెలిస్తే అందరూ షాక్ అవుతారు.. ఏకంగా రూ.65,407 ఖరీదైన టీ షర్ట్ ను ఎన్టీఆర్ ధరించాడు. ఆ టీ షర్ట్ లో ఎన్టీఆర్ ఉన్నా ఫొటోస్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

Share post:

Latest