టాలీవుడ్ ఫ్యూచర్ అంతా ఆ సినిమాలపైనే డిపెండ్ అయ్యిందా..??

 

ప్రజలు 2022 ఏడాదికి గుడ్ బై చెప్పి ఎన్నో హోప్స్‌తో 2023వ సంవత్సరానికి ఆహ్వానం పలికారు. అయితే ఈ కొత్త సంవత్సరంలో టాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉంటుందనేది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈ ఏడాది ఇప్పటివరకు పెద్ద సినిమాలు ఏమీ రిలీజ్ అవ్వలేదు. ఇంకా కొన్ని రోజులో సంక్రాంతి పండుగ రానుంది. ఇక ఈ పండుగ సందర్భంగా ప్రేక్షకులను అలరించడానికి విజయ్ నటించిన ‘వారసుడు’ సినిమా రిలీజ్ అవుతుంది. దిల్ రాజు దర్శకత్వం వహించిన వారసుడు సినిమాపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

ఆ తరువాత బాలకృష్ణ నటించిన ‘వీర సింహ రెడ్డి’, చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలు ఒక రోజు గ్యాప్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక ఈ రెండు సినిమాల ఫలితాలను బట్టి ఈ ఏడాది తెలుగు సినిమా పరిశ్రమ గురించి ఒక అంచనా వేయవచ్చని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు సినిమాలలో కనీసం ఒక సినిమా అయిన విజయం సాధిస్తే ఈ ఏడాది టాలీవుడ్‌కి కచ్చితంగా మంచి జరుగుతుంది అని చాలా మంది అంటున్నారు.

చిన్న చిన్న సినిమాలు సక్సెస్ కావడం అనేది కామన్, కానీ పెద్ద సినిమాలు చాలా అరుదుగా విజయం సాధిస్తుంటాయి. అయితే ఈ ఏడాది పెద్ద హీరోల సినిమాలు మంచి సక్సెస్ సాధించి, భారీ కలెక్షన్లు వారి ఖాతాలో వేసుకోవాలని సినీ ప్రేమికులు ఆశపడుతున్నారు. ఈ కొత్త సంవత్సరంలో మొదటి భారీ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు అందిస్తున్నారు. అయితే బాలకృష్ణ నటించిన వీర సింహ రెడ్డి సినిమా జనవరి 12న విడుదల అవుతుండగా, మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్‌ని షేక్ చేస్తాయని ఆయా సినిమా హీరోల అభిమానులు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.