ఎన్టీఆర్ లో ఉన్న ఐదు గొప్ప లక్షణాలు ఏమిటో తెలుసా.. అవి ఏమిటంటే..!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గత సంవత్సరం వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకుని తన స్టామినాను ప్రపంచ సినీ జనాలకు చూపించాడు. ఎన్టీఆర్ తన తర్వాత సినిమాలను కూడా పాన్ ఇండియా రేంజ్ లో చేయడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం తన 30వ సినిమాను స్టార్ దర్శకుడు కొరటాల శివతో చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ని న్యూ ఇయర్ కానుకగా చిత్ర యూనిట్ అందించింది. ఈ సినిమాను 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని అధికార ప్రకటన అందించింది.

ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నామని చిత్ర యూనిట్ చెప్పగానేచెప్పింది. అభిమానులో మాత్రం ఈ సంవత్సరం వస్తుందనుకున్నా వారికి మాత్రం ఇది నిరాశ మిగిల్చింది. ఈ విషయాలు పక్కన పెడితే.. ఎన్టీఆర్ లో ఉన్న ఐదు గొప్ప లక్షణాలు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ చర్చ జరుగుతుంది. ఎన్టీఆర్ ఎంత స్టార్ హీరో అయినప్పటికీ తనకంటే పెద్దవారిని గౌరవించేే విషయంలో ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు.

తన సినిమాల వల్ల నిర్మాతలు ఎవరికీ నష్టం వచ్చిన వారికి సహాయం చేసే విషయంలో కూడా ఎన్టీఆర్ ముందు వరుసలోనే ఉంటారు. అయితే నిర్మాతలకు తాను చేసిన సహాయం గురించి ప్రచారం చేసుకోవడానికి ఎన్టీఆర్ అసలు ఇష్టపడడు. ఎన్టీఆర్ కొత్త టాలెంట్ ను పరిచయం చేసే క్రమంలో కూడా ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ఎన్టీఆర్ తన కెరియర్ మొదటిలో ఎందరో కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చారు.. ఎన్టీఆర్ అవకాశం ఇచ్చిన వారిలో దర్శక ధీరుడు రాజమౌళి, డైనమిక్ డైరెక్టర్ వివి వినాయక్ కూడా ఎన్టీఆర్ సినిమాలతోనే చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు.

ఇక తన సినీ కెరీర్ లో ఎంతోమంది ఫ్లాప్ డైరెక్టర్లకు ఆవ‌కాశం ఇచ్చి ఆయా దర్శకుల కెరీర్ పుంజుకోవడానికి ఎన్టీఆర్‌ తన వంతు సహాయం అందించాడు. ఇక చాలామంది హీరోలు వారి సినిమాల‌ కథలలో వేలు పెడుతుండగా ఎన్టీఆర్ మాత్రం తనతో చేసే డైరెక్టర్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తాడు. దర్శకుడు ఏది చెబితే అది తన ప్రయత్నానికి మించి చేసి చూపిస్తాడు. ఈ విషయంలో కూడా ఎన్టీఆర్ గ్రేట్ అంటూ కామెంట్లు కూడా వస్తున్నాయి.

Share post:

Latest