100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన ధమాకా..?

మాస్ హీరో రవితేజ నటించిన తాజా చిత్రం ధమాకా. ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రీ లీల నటించింది. ఈ సినిమాని డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇప్పటికీ విజయవంతంగా మూడో వారంలో అడుగుపెట్టింది. తాజాగా ఈ సినిమా కలెక్షన్లతో అరుదైన ఘనతను సాధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కేవలం రెండు వారాలలోనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు సమాచారం. ఈ రకంగా రవితేజ కెరియర్ లోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన మొదటి చిత్రం ఇదే అన్నట్లుగా తెలుస్తోంది.

Dhamaka - Teaser | Ravi Teja | Sreeleela | Bheems Ceciroleo | Thrinadha Rao  Nakkina - YouTube
ఈ సినిమా నాన్ థియేటర్ బిజినెస్ లోనే పూర్తి పెట్టుబడి కూడా రికవరీ వచ్చినట్లు సమాచారం. ఎంతో వసూలు చేసిన అది నిర్మాతలకు అదనపు ఆదాయమే అన్నట్లుగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో రూ .100 కోట్ల క్రాస్ రాబట్టిన ఈ సినిమా నిర్మాతలకు ,డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను తెచ్చి పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నో సంవత్సరాల తర్వాత రవితేజ ఇలాంటి వినోదాత్మక పాత్రలో చూసి అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. ముఖ్యంగా స్క్రీన్ ప్రజెంటేషన్ కామెడీ టైమింగ్ డాన్స్ ఫైట్లు చూడదగ్గ గా ఉన్నాయంటే అభిమానులు చాలా కామెంట్లు చేస్తున్నారు.

Dhamaka 14 days Box office Collections: Bombarding Rs 100 Cr+ gross

రవితేజ ఎనర్జీకి శ్రీ లీల ఎనర్జీ తోడవడం వల్ల ఈ సినిమా మరింత సక్సెస్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సంక్రాంతి సెలవులకు కూడా ధమాకా సినిమా బాగా కలిసొస్తుందని చిత్ర బృందం ధీమాతో ఉన్నది. మరి రాబోయే రోజుల్లో ధమాకా చిత్రం ఎంతటి కలెక్షన్లను రాబడుతుందో చూడాలి మరి.

Share post:

Latest