వీర సింహారెడ్డి – వాల్తేరు వీర‌య్య‌కు ఎన్ని కామ‌న్ పాయింట్సో చూశారా?

ఈ సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు న‌ట‌సింహం నంద‌మూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి తలపడిన సంగతి తెలిసిందే. బాలయ్య `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. చిరంజీవి `వాల్తేరు వీరయ్య‌` సినిమాతో ప్రేక్షకుల‌ను అలరించేందుకు వచ్చాడు. అయితే సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ రెండు సినిమాలకు మిక్స్ రివ్యూలు వచ్చాయి. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రేంజ్ లో వ‌సూళ్ల‌ను రాబడుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాకు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో కామెంట్ పాయింట్స్ ఉన్నాయి. అవి ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

అటు వాల్తేరు వీరయ్య ఇటు వీరసింహారెడ్డి రెండు చిత్రాల్లోనూ శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. అలాగే ఈ రెండు చిత్రాలను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మించారు. వాల్తేరు వీరయ్య సినిమాకు బాబి దర్శకత్వం వహించగా.. వీరసింహారెడ్డి సినిమాను గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేశాడు. అయితే ఇద్దరు డైరెక్టర్లు ఈ సినిమాల్లో నటించిన హీరోలకు వీరాభిమానులు కావ‌డం కామ‌న్ పాయింట్‌.

ఈ రెండు సినిమాలకు రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్ గా వ్యవహరించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్స్ లో ఒకరైన శేఖర్ మాస్టర్ ఈ రెండు చిత్రాలకు వర్క్ చేశారు. వీరసింహారెడ్డి సినిమాలో స‌వ‌తి చెల్లి పాత్ర కీలకంగా మారితే.. వాల్తేరు వీర‌య్య‌ సినిమాలో స‌వ‌తి తమ్ముడు పాత్ర హైలెట్ గా నిలుస్తుంది.

అలాగే బాల‌య్య సినిమాలో స‌వితి చెల్లి పాత్ర చనిపోతుంది.. వాల్తేరు వీరయ్య సినిమాలో స‌వతి తమ్ముడి పాత్ర‌ కూడా చనిపోతుంది. మ‌రో కామన్ పాయింట్ ఏంటంటే.. ఈ రెండు సినిమాల్లోనూ విలన్స్ తల తెగిప‌డ‌టం. ఇక వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి.. ఈ రెండు టైటిల్ లోనూ వీర కామన్ గా ఉంది.