షారుఖ్ ఖాన్‌తో పోటీగా బన్నీ, ప్రభాస్ అరుదైన రికార్డు..!

ప్రేక్షకులు ఎదురు చూస్తున్న పాన్ ఇండియా మూవీలలో కొన్ని సినిమాలు ఈ ఏడాది విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ విషయానికి సంబంధించి IMDB అధికారిక జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో సౌత్ సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ సౌత్ సినిమా కంటే ఎక్కువగా ఒక్క హిందీ సినిమా టాప్‌లో ఉంది.

IMDB నివేదికల ప్రకారం బాలీవుడ్ ప్రముఖ హీరో షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్ ‘ సినిమా అగ్ర స్థానంలో ఉంది. ఈ ఏడాది ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాలో పఠాన్ సినిమా కూడా ఒకటి. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాపై విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. అలా ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ పెరిగింది.

ఇక పఠాన్ సినిమా తరువాత స్థానంలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప ది 2: రూల్’ సినిమా ఉంది. ఇక మూడవ స్థానం లో షారుఖ్ ఖాన్ మరో చిత్రం జవాన్ ఉండగా, ఆ తరువాత ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’, ‘సలార్’ సినిమాలు నాలుగు, ఐదు స్థానంలో ఉన్నాయి. అయితే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా కూడా టీజర్ విడుదల అయినప్పుడు విపరీతంగా ట్రోల్స్‌ బారిన పడింది. ఇక 2023లో ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్న టాప్ 5 సినిమాలో ఆదిపురుష్ సినిమా కూడా ఒకటి.

ఇక షారుఖ్ ఖాన్ నటించిన మరో సినిమా ‘డుంకీ ‘ టాప్ 20 వ స్థానంలో ఉంది. బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నుండి మూడు సినిమాలు రానున్నాయి. అలానే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3, కిసి కా బాయ్ కిసి కి జాన్ అనే రెండు సినిమాలపై ఈ ఏడాది భారీగా అంచనాలు ఉన్నాయి.