అందాల ముద్దుగుమ్మకు అలాంటి జబ్బు..బిగ్ బాస్ పునర్నవి హెల్త్ కండీషన్ క్రిటికల్..!?

పునర్నవి భూపాలం .. ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు . తనదైన స్టైల్ లో పలు సినిమాల్లో సెకండ్ హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ ఉయ్యాల జంపాల అనే సినిమాతో ఫస్ట్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. కాగా చిన్నారి పెళ్లికూతురు అవికాగోర్ హీరోయిన్ గా..హీరో రాజ్ తరుణ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో పునర్నవి భూపాలం సెకండ్ హీరోయిన్ పాత్రలో మెరిసి మెప్పించింది .

ఈ సినిమాలో పునర్నవి భూపాలం నటనకు మంచి మార్కులు పడ్డాయి . ఈ సినిమా తర్వాత పలు సినిమాలో నటించినప్పటికీ.. పునర్నవి భూపాలం పేరు పెద్దగా హిట్ ట్రాక్ లో పడలేదు . ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఆఫర్ రావడంతో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన పునర్నవి భూపాలం ..తోటి కంటెస్టెంట్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో నడిపిన ప్రేమ యవ్వారం ఇప్పటికీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా వినిపిస్తూనే ఉంటుంది. హౌస్ లో ఉన్న అన్ని నాళ్లు చేతిలో చేయి వేసుకుంటూ తిరిగిన ఈ జంట హౌస్ నుంచి బయటకు రాగానే ఎవరి దారి వాళ్ళది అన్నట్లు వెళ్లిపోయారు.

పలు ఇంటర్వ్యూకి జంటగా అటెండ్ అయిన ..ఆ తర్వాత రాహుల్ సిప్లిగంజ్..పునర్నవి భూపాలెం వేరువేరుగా జీవిస్తున్నారు. కాగా రీసెంట్గా పునర్నవి భూపాలం అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తుంది . దీనికి సంబంధించి పునర్నవి భూపాలం ఇంస్టాగ్రామ్ లో స్టేటస్ పెట్టింది . ఆమె పోస్ట్ చేస్తూ..” నా న్యూ ఇయర్ చెస్ట్ కంజెన్షంతో తో మొదలైంది. నేను అనారోగ్యానికి గురవ్వడం ఇదే లాస్ట్ సారి కావాలి అంటూ కోరుకుంటున్నాను “అంటూ తన బెడ్ పై బాధపడుతున్న పిక్ ని పోస్ట్ చేసింది .

ఈ ఫోటోలో పునర్నవి ముఖం లాగేసినట్లు కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఆమె అభిమానులు బాధపడుతున్నారు . నువ్వు త్వరగా కోలుకోవాలని మెసేజ్లు పెడుతున్నారు . అందుతున్న సమాచారం ప్రకారం పునర్నవి భూపాలం ఊపరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. దగ్గు, ఊపిరి సరిగ్గా తీసుకోకపోవడం వంటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటుంది . ఈ క్రమంలోనే పునరున్నవి భూపాలం ఫ్రెండ్స్ బెస్ట్ విషెస్ చెప్పుతూ ఆమె కోలుకోవాలని తెలియజేస్తున్నారు.