బాలయ్య- ప్రభాస్ మల్టీస్టరర్.. ఇక ఇండియన్ బాక్స్ ఆఫీస్ బద్దలై పోవాల్సిందే..!

ఇప్పుటి వరకు చిత్ర పరిశ్రమలో ఎన్నో గొప్ప మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. ఇక మన సీనియర్ హీరోలైన ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ఎన్నో మల్టీ స్టార్ సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించారు. అయితే ఈ మధ్యకాలంలో మల్టీ స్టార్ సినిమాలకు కాస్త బ్రేక్ పడినప్పటికీ ఇప్పుడు మరోసారి ఈ మల్టీ స్టార్ సినిమాల ట్రెండ్ కొనసాగుతుంది. ఇక ఇలా ఒకే సినిమాలో ఇద్దరు హీరోలు నటిస్తే వారి అభిమానులకు పండగనే చెప్పాలి.

ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీ స్టార్ సినిమాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. టాలీవుడ్ లో ఇప్పుడు ఓ సూపర్ క్రేజీ మల్టీస్టారర్ రాబోతున్నట్టు తెలుస్తుంది. బాహుబలి సినిమాల‌తో పాన్‌ ఇండియా హీరోగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక రీసెంట్‌గా బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో లో కూడా పాల్గొని బాలయ్యతో రచ్చ చేశాడు. ఆ ఎపిసోడ్ కు ఎవరు ఊహించని రితిలో ఆహా యాప్ ను షేక్ చేసింది.

ఆ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయిన కేవలం ఐదు రోజుల్లోనే 100 మిలియన్ కు పైగా వ్యూస్ ను రాబట్టుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక క్రేజీ అప్డేట్ వైరల్ గా మారింది. బాలయ్య- ప్రభాస్ కలిసి ఓ మల్టీ స్టార్ సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాను ఓ బాలీవుడ్ బడా డైరెక్టర్ తెరకెక్కించబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఆ బడా డైరెక్టర్ ఈ సినిమా కోసం కథను కూడా రెడీ చేశాడట. త్వరలోనే ఇద్దరు హీరోలకి ఆ సినిమా కథ చెప్పడానికి రెడీ అయ్యాడట. ఇక ఇద్ద‌రి హీరోలకు కథ నచ్చితే మాత్రం ఈ సూపర్ క్రేజీ కాంబో తెరపైకి రాబోతుందని సమాచారం.

Balayya Helping Prabhas Than Two Pan-India Films

ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. అతి త్వరలోనే ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయం బయటకు రానున్నట్టు తెలుస్తుంది. అని అనుకున్నట్టు జరిగితే ఈ సూపర్ కాంబో తెరకెక్కితే మాత్రం బాలయ్య- ప్రభాస్ అభిమానులకు పండగే.. ఇక ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద మరో సెన్సేషన్ క్రియేట్ అవ్వటం ఖాయం. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Share post:

Latest