మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అదిరిపోయే ప్లాన్‌తో బాలయ్య..!

నందమూరి బాలకృష్ణ తన కెరియర్ లో జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం వచ్చే సంక్రాంతికి వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న బాలయ్య.. ఆ తర్వాత వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇక ఈ విషయాలు పక్కనపెడితే.. బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మొన్నటి వరకు బాలయ్య వారసుడు మోక్షజ్ఞ మీడియాకు పెద్దగా కనిపించింది అరుదు. ఎప్పుడో బాలకృష్ణ లెజెండ్ సినిమా షూటింగ్ టైమ్‌లో మోక్షజ్ఞ ఫొటోస్ బయటకు వచ్చాయి. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆ టైమ్‌లో బైక్ మీద కూర్చున్న అవే ఫొటోస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ గత కొంతకాలంగా మోక్షజ్ఞ ఎక్కువగా మీడియాలో కనిపిస్తున్నాడు. తన కుటుంబం కోసం వేసుకునే స్పెషల్ షోలకు తండ్రితో పాటు కలిసి వస్తున్నాడు. ఇక రీసెంట్‌గా అన్ స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌లో కూడా మోక్షజ్ఞ పాల్గొన్నాడని తెలుస్తుంది.

ఇక న్యూ ఇయర్ కానుక‌గా వచ్చిన వీర సింహారెడ్డి మేకింగ్ వీడియోలో కూడా మోక్షజ్ఞ తన తండ్రితో కలిసి కనిపించాడు. ఇక మొన్నటి వరకు బయట అసలు కనబడని ఈ నందమూరి యువ హీరో ప్రస్తుతం వరుస ఈవెంట్స్ లో పాల్గొంటూ నందమూరి అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తున్నాడు. బాలయ్య కూడా మోక్షజ్ఞను ఈ సంవత్సరంలోనే హీరోగా పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే వరుస షూటింగ్స్ కి పిలుస్తున్నాడని తెలుస్తుంది.

అంతా అనుకున్నట్లు జరిగితే సీనియర్ ఎన్టీఆర్ బాలయ్యను చిత్ర పరిశ్రమకు తీసుకొచ్చినట్లు.. బాలయ్య కూడా మోక్షజ్ఞను తన దర్శకత్వంలోనే హీరోగా పరిచయం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆదిత్య 999 మ్యాక్స్ ప్రాజెక్ట్ ను తన దర్శకత్వంలోనే తెరకెక్కిస్తానని బాలయ్య ఇప్పటికే ప్రకటించాడు. ఈ సినిమాతోనే మోక్షజ్ఞ హీరోగా పరిచయం చేసే ఆలోచనలో ఉన్నాడట బాలయ్య. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నందమూరి అభిమానులకు త్వరలోనే శుభవార్త వచ్చే అవకాశం కనిపిస్తుంది.

Share post:

Latest