అక్కినేని కోడలు అమల.. హిందూ పండగలు చేసుకోకపోవడానికి కారణం అదేనా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అమల గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయక్కర్లేదు . తనదైన స్టైల్ లో సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాల్లో హీరోయిన్గా నటించిన ముద్దుగుమ్మ ..తన కోస్టార్ అక్కినేని నాగార్జునను ప్రేమించి రెండో పెళ్లి చేసుకుంది. ఎస్ అక్కినేని నాగార్జునకు అప్పటికే పెళ్లయిపోయింది . ఓ బాబు కూడా ఉన్నాడు. అయినా ఏంటో విచిత్రంగా వీళ్ళ మధ్య ప్రేమ పుట్టుకొచ్చింది. ఆ ప్రేమను కాదనుకోలేక నాగార్జున సొంత భార్య లక్ష్మి కు విడాకులు ఇచ్చి మరి అమలను పెళ్లి చేసుకున్నాడు.

కాగా ఈ జంట పెళ్లి తర్వాత మరో బిడ్డకు జన్మనిచ్చింది . ప్రజెంట్ ఇద్దరు కొడుకులు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని పేరు నిలబెట్టడానికి తెగ ట్రై చేస్తున్నారు . కాగా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది జంటలు ఉన్నా అమల-నాగర్జున జంట అంటే అందరికీ ప్రత్యేకమే ..లవబుల్ కపుల్ అంటూ ట్యాగ్ కూడా వేయించుకున్నారు. అయితే అందరూ సెలబ్రిటీస్ ప్రతి పండుగను సాంప్రదాయ బద్ధంగా సెలబ్రేట్ చేసుకుని దానికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు.

అయితే అమల మాత్రం పూజలకు పుణస్కారాలకు దూరంగా ఉంటుంది . అంతేకాదు అమల ఇంట్లో దీపం కూడా వెలిగించదు అనే రూమర్ ఎప్పటినుంచో సోషల్ మీడియాలో వినిపిస్తుంది . కాగా సంక్రాంతి కానుకగా కూడా అమల ఎటువంటి హంగామా చేయకపోవడం తో సోషల్ మీడియాలో ఎందుకు ఆమె హిందూ పండుగలు జరుపుకోదు అని ఆసక్తికరమైన ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే అమలా మొదటి నుంచి రియాలిటీ కి దగ్గరగా ఉంటుందని ..ఎక్కువ పండగలు , పూజలు చేసుకోదని ..చదువుకున్న ఆవిడ ఎక్కువగా సైన్స్ ని నమ్ముతుందని.. ఆ కారణంగానే పండగలకు అమల దూరంగా ఉంటుందననే టాక్ బలంగా వినిపిస్తుంది..!!