2023 అంతా కూడా రెబల్ స్టార్ హవా నేనా..?

గత కొన్నేళ్లుగా ఏ ఇండస్ట్రీలోనైనా పాన్ ఇండియా సినిమా తెరకెక్కించాలని హీరోలు అభిమానులు చాలా ఆత్రుతగా ఉంటున్నారు. ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ రేంజ్ కు ఎదిగేస్తూ ఉంటోంది. ఇక ఈ ఏడాది విడుదల కావస్తున్న కొన్ని పాన్ ఇండియా సినిమాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వేలు పడుతున్నాయి. ప్రభాస్ నటించిన మూడు పాన్ వరల్డ్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయని టాక్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది.

Prabhas' Salaar, Allu Arjun's Pushpa 2 and more Telugu movies shoots to  resume? Emergency meeting held to decide their fateఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్ -k వంటి చిత్రాలు ఏడాది విడుదలయ్యేందుకు అవకాశం ఉందని టాక్ బాగా వినిపిస్తోంది. వీటిలో ఏదో ఒకటి వచ్చే ఏడాది మాత్రం విడుదలవుతోందని అభిమానులు భావిస్తున్నారు. కానీ చిత్ర బృందం మాత్రం ఈయడాదే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆది పురుష్ సినిమా త్రీడీగా తిరగెక్కబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి వీటితోపాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ప-3 సినిమా కూడా వార్లోకి నిలుస్తోంది .అలాగే మణిరత్నం తెరకెక్కించిన భారీ సీక్వెల్ చిత్రం పొన్నియన్ సెల్వన్ 2 సినిమా కూడా పోటీకి రాబోతోంది.

ఇకపోతే ఆది పురుష 3D సినిమా విషయానికి వస్తే.. ఇందులో ప్రభాస్, శ్రీరాముడి పాత్ర పోషిస్తూ.. కృతిసనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటించారు. మేకర్స్ గత ఏడాది ఈ సినిమా టీజర్ ను విడుదల చేసినా.. ఆశించిన స్పందన దక్కకపోగా విమర్శలు వచ్చాయి.క్వాలిటీ లేని VFX తో ఫ్యాన్స్ కూడా నిరాశ చెందారు. ఈ చిత్రం ఈ యేడాది జనవరి లో థియేటర్ లోకి రావాల్సి వుండగా.. జూన్ కి వాయిదా వేశారు. అలాగే ప్రభాస్ సలార్ , ప్రాజెక్ట్-k సినిమా ఈ ఏడాది విడుదల కాబోతున్నట్లు సమాచారం.