తెలుగు సినీ ఇండస్ట్రీలో అభిమానులు అభిమానించే హీరోలు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తెరకెక్కించి మరింత పాపులారిటీ సంపాదించుకుంటున్నారు మన హీరోలు. పలువురు హీరోలు వాణిజ్య ప్రకటనలతో పాటు పలు రకాల బిజినెస్లు చేస్తు బాగానే సంపాదిస్తున్నారు. అలా ఇప్పటివరకు ఎంతమంది హీరోలు ఎలాంటి వ్యాపారాలను స్థాపించారు వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాదులో బఫెలో వింగ్స్ ఫ్రాంచైజీ అనే పేరుతో ఒక బార్ ను ప్రారంభించారు. ఇది ప్రారంభమై ఇప్పటికి చాలా రోజులవుతుంది. ఆ తర్వాత బన్నీ 800 జూబ్లీహిల్స్ పేరుతో పబ్ కూడా రన్నింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఇవే కాకుండా అతడి భార్య స్నేహారెడ్డి ఒక ఫోటో స్టూడియో ఇటీవలే అల్లు అర్జున్ కూడా థియేటర్ల వ్యాపారం లోకి కూడా ప్రవేశించారు. ఇవే కాకుండా పలు రకాల యాడ్లలో కూడా నటిస్తున్నారు.
మహేష్ బాబు సినిమాలు చేసేవి తక్కువైనా సరే ప్రతి ఏడాది భారీగానే సంపాదిస్తూ ఉంటారు. ఎన్నో పాపులర్ బ్రాండ్లకు అంబాసిడర్ గా కూడా ఉన్నారు మహేష్. హైదరాబాదులో థియేటర్ల వ్యాపారాన్ని కూడా ప్రారంభించారు. ఇక ఇటీవల నమ్రతా కూడా ఒక రెస్టారెంట్ ని మొదలుపెట్టింది.
రామ్ చరణ్ విమాన రంగంలోకి ప్రవేశించారు. అలాగే రామ్ చరణ్ ఇప్పటికే కొన్నిదెల ప్రొడక్షన్ హౌస్ ని నిర్మించారు. రామ్ చరణ్ భార్య అపోలో హాస్పిటల్ లో కీలక వాటాధారని తెలుస్తోంది. ఇక అంతే కాకుండా హైదరాబాదులో పోలో అండ్ రైడింగ్ క్లబ్ యజమాని.
ప్రభాస్ బాహుబలి సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించారు. ప్రభాస్ సొంతంగా ఒక మల్టీప్లెక్స్ థియేటర్లను చైన్ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత వాణిజ్య ప్రకటనలు నటించేందుకు ఆసక్తి చూపించారు. ప్రభాస్ మాత్రం ఎక్కువగా సినిమాలకే ప్రాధాన్యత ఇస్తారు.