డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బద్రి సినిమాతో తన కెరియర్ ను మొదలుపెట్టిన ఈయన ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించి రాంగోపాల్ వర్మ శిష్యుడు అనిపించుకున్నారు. ఇకపోతే సినిమాల ద్వారా నష్టాలను చవిచూస్తున్న పూరీ జగన్నాథ్ కష్టాలలో కూడా ఒక వ్యక్తికి సహాయం చేస్తూ తన మంచి మనసును చాటుకుంటున్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు ప్రముఖ సీనియర్ నటిమణి రమాప్రభ.ఎవరికి ఎవరో అన్న ఈ కాలంలో కూడా తన సినిమాలలో నటించినందుకుగాను ఆమె కష్టాల్లో ఉన్న పరిస్థితిని తెలుసుకొని పూరీ జగన్నాథ్ ఇప్పటికీ కూడా ప్రతి నెల 5వ తేదీలోపు కచ్చితంగా ఆమె ఖాతాలో కొంత డబ్బు జమ చేస్తున్నట్లు ఆమె స్వయంగా మీడియాతో వెల్లడించింది.
అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.తెలుగు, తమిళ్ భాషలలో కలుపుకొని .. 1966 నుంచీ 2015 వరకు కొన్ని వందల సినిమాలలో నటించిన ఈమె నిన్నే పెళ్ళాడతా , దేవదాసు, అప్పుల అప్పారావు, ప్రేమంటే ఇదేరా వంటి ఎన్నో బ్లాక్ పాస్టర్ చిత్రాలలో కూడా నటించింది.ఇప్పుడు వయసు మీద పడడంతో పాటు సినిమాలలో అవకాశాలు లేకపోవడంతో హైదరాబాద్ విడిచి ఒంటరిగా చిత్తూరులోని మదనపల్లిలో జీవనం సాగిస్తోంది. అక్కడే అర ఎకరం స్థలంలో ఇల్లు నిర్మించుకొని ఆ ఇంటి పైన చిన్న రేకుల షెడ్డులో తన ఒంటరి జీవితాన్ని గడిపేస్తున్నారు రమాప్రభ.సినిమాల్లో ఉన్నప్పుడు వేలకోట్ల ఆస్తులను సంపాదించినా తనకంటూ ఏమీ మిగులుచుకోలేకపోయింది. ప్రస్తుతం ఆర్థికపరమైన ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్న ఈమెకు తానెవరో తెలియకుండా ప్రతినెల అకౌంట్ లో కొంత డబ్బు వేసి ఆమెను ఆర్థికంగా ఆదుకుంటున్నారు డైరెక్టర్ పూరీ జగన్నాథ్.
ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. ఒకసారి పూరీ బాబుతో నేను గుర్తున్నానా అని అడిగాను.. అయితే పూరీ బాబు నేరుగా నీ పుట్టినరోజు ఎప్పుడూ అని అడగ్గానే మే 5 అని చెప్పాను. ఇక అప్పటి నుంచి మే 5వ తేదీ లోపల నా అకౌంట్లో డబ్బు వేస్తున్నాడు. అయితే ఈ విషయం తెలుసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది అంటూ అసలు విషయాన్నీ తెలిపింది రమాప్రభ. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పూరీ మంచితనానికి ఫిదా అవుతున్నారు.