టాలీవుడ్లో నందమూరి కుటుంబం నుంచి కళ్యాణ్ రామ్ ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది. ఏదైనా సరికొత్తదనాన్ని పరిచయం చేయాలి అంటే కళ్యాణ్ రామ్ ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. అలా ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించి కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు. చివరిగా బింబిసార సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. మునుపటిలాగా కాకుండా కథల విషయం లో పలు జాగ్రత్తలు తీసు కొంటున్నారు కళ్యాణ్ రామ్. డిఫరెంట్ కథలు ఉండే జోనర్ను వెతికి మరి తీసుకుంటున్నారు. పాత్ర పరంగా హైలెట్ అయ్యేలా చూస్తున్నారు కళ్యాణ్ రామ్.
అలా ఈ నేపథ్యంలో ఆమిగోస్ , డేవెల్ వంటి వైవిధ్యమైన సినిమాలలో నటిస్తూ దూసుకు వెళ్తున్నారు ఈ రెండు కూడా చాలా డిఫరెంట్ సినిమాలని తెలుస్తోంది. ఇక డెవిల్ సినిమా కోసం కళ్యాణ్ రామ్ చాలా గట్టిగానే శ్రమిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తన శరీరం పైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తమిళనాడులోని కారైకుడి లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. 20 రోజులపాటు అక్కడే ఈ సినిమా షూటింగ్ ఏకధాటిగా జరగబోతున్నట్లు సమాచారం.
ఇప్పుడు తాజాగా ఈ సినిమా కు సంబంధించి కథ లీక్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఒక పీరియాడిక్ స్టోరీ ఆని ఇందులో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించబోతున్నారని ఈ రెండు హింట్స్ ని బట్టి డెవిల్ డిఫరెంట్ కంటెంట్ గల చిత్రమని చెప్పవచ్చు. పిరియాడిక్ స్టోరీ కావడంతో ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ కొన్నేళ్ల క్రితం అహర్యంలో కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అప్పటి బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్లు ఎలా ఉండేవారు ఆ లుక్కుని తీసుకున్నారని అందుకోసం కళ్యాణ్ రామ్ ప్రత్యేకంగా సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. మరి డెవిల్ సినిమా నుంచి ఇలాంటి అప్డేట్ వస్తుందో చూడాలి మరి.