ఇండియా పాకిస్తాన్ లకు చెందిన ప్రముఖ క్రికెటర్ షోయబ్ మాలిక్, సానియా మీర్జాతో వివాహం తర్వాత బాగా పాపులర్ అయ్యారు. ఇక గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి వీరిద్దరి మధ్య విడాకులపై పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా వీరిద్దరూ కలిసి ఒక రియాలిటీ టాక్ షో తో వీరి విడాకుల వ్యవహారాలపై ఇప్పటివరకు స్పందించలేదు. చట్టపరమైన సమస్యలు కారణంగా వీరిద్దరూ అధికారికంగా ఇంకా స్పందించలేదని వార్తలు వినిపిస్తున్నాయి. చివరకు వీరి విడాకుల గురించి కూడా సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తూన్నాయి.
చివరకు వీరి విడాకుల గురించి వార్తలు రావడంతో మౌనం వీడిన షోయబ్ మాలిక్ మాత్రం ఒక న్యూస్ ఛానల్ లో మాట్లాడుతూ.. తమ వ్యక్తిగత విషయాన్ని దానిని ఒంటరిగా వదిలేయండి అని సమాధానాన్ని ఇచ్చారట. సానియా తాను విడిపోవడంపై ఎలాంటి ప్రశ్నలకు సంబంధించి సమాధానం ఇవ్వమని షోయబ్ మాలిక్ తెలియజేసినట్లు తెలుస్తోంది.ఈ జంట తమ విడాకులను ప్రకటించలేకపోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుచేత అంటే వారు కొన్ని వృత్తిపరమైన కట్టుబాటులను కలిగి ఉన్న సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అందులో ఓటీటి షో ది మీర్జా మాలిక్ షో కూడా ఉన్నది…
సానియా మీర్జా- షోయాబ్ మాలిక్ ఐదు నెలల పాటు డేటింగ్ తర్వాత 2010లో వివాహం చేసుకున్నారు. వీరిరువురికి ఇజాన్ మీర్జా మాలిక్ అని కుమారుడు కూడా జన్మించారు. వీరి విడాకుల వ్యవహారం వైరల్ గా మారిన వెంటనే నటి అమేషా ఒయర్ తో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి. అయితే ఇవన్నీ కూడా వట్టి పుకార్లేనని ఆమేషా షోయబ్ తన భార్యతో చాలా సంతోషంగా ఉన్నారని తెలియజేసింది.