కోలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టులో మొదట వినిపించే పేరు విశాల్. ఈయనకు 45 ఏళ్లు. ఆయన వయసు వాళ్లంతా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేస్తుంటే.. విశాల్ మాత్రం ఇంకా బ్యాచిలర్‌గా ఉన్నారు. గతంలో తెలుగు అమ్మాయి అనీషా రెడ్డిని ప్రేమించాడు. ఆమెతో విశాల్ నిశ్చితార్థం కూడా జరిగింది.
కానీ, పెళ్లి వరకు వెళ్లకుండా వీరి బంధం తెగిపోయింది. ఆ తర్వాత విశాల్‌కు పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. ఆయన అప్పుడు, ఇప్పుడు అంటూ తప్పించుకుంటూనే ఉన్నారు. ఇక తాజాగా ప్రభాస్ పెళ్లితో ముడిపెట్టాడు. తాజాగా విశాల్ ను పెళ్లి గురించి ప్రశ్నించగా.. వివాహం ఎన్నో బాధ్యతలతో కూడుకున్నది. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ ప్రస్తుతానికి నా ఫోకస్ మొత్తం వర్క్‌లైఫ్ పైనే ఉంది` అని పేర్కొన్నాడు.
దాంతో మీడియా వారు `వచ్చే ఏడాది అయినా పెళ్లి చేసుకుంటారా?` అని ప్రశ్నించగా.. అందుకు విశాల్ `ప్రభాస్ పెళ్లి చేసుకున్న వెంటనే తాను కూడా పెళ్లి చేసుకుంటా` అని సరదాగా బదులిచ్చాడు. దీంతో ఈయన కామెంట్స్ వైరల్ మారాయి. అయితే వయసులో విశాల్ కంటే ప్రభాస్ చిన్నోడు. అయినాసరే ప్రభాస్ పెళ్లితో విశాల్ ముడిపెట్టడంతో.. ఇది కాస్త ఓవర్‌గా లేదు అంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. ప్రభాస్ పెళ్లి వరకు వెయిట్ చేస్తే నువ్వు ముసలోడివి అయిపోతావని కామెంట్స్ చేస్తున్నారు.