నటసింహ బాలకృష్ణ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం వీరసింహారెడ్డి.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పనులను పూర్తయ్యాయి నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుపుకుంటున్న నేపథ్యంలో.. సినిమాపై బజ్ క్రియేట్ చేయడానికి సినిమాకు సంబంధించిన పాటలను, వీడియోలను, ప్రోమోలను రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు వీరసింహారెడ్డి నుంచి లిరికల్ వీడియోని తాజాగా కొన్ని నిమిషాల ముందు విడుదల చేయడం జరిగింది. సుగుణసుందరి అంటూ సాగే ఈ పాట మాస్ , క్లాస్ అంటూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
బాలయ్య కూడా ఎప్పుడూ లేనివిధంగా ఈసారి తన డాన్స్ స్టైల్ మార్చుకొని మరింతగా తన స్టెప్పులతో అభిమానులకు పూనకాలు తెప్పించారు. అటు శృతిహాసన్ కూడా తనదైన స్టైల్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం సుగుణసుందరి అంటూ సాగే ఈ లిరికల్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇకపోతే బాలయ్య విషయానికి వస్తే.. అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకోగా.. ఇప్పుడు గోపీచంద్ దర్శకత్వంలో ఈ వీర సింహారెడ్డి సినిమాను తెరకెక్కిస్తున్నారు. జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో పక్క మాస్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలు తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. వీర సింహారెడ్డి సినిమా విడుదల అయిన వెంటనే అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమాలు మొదలుపెట్టబోతున్నారు. సినిమాలపరంగా బిజీగా ఉంటూనే మరొకవైపు ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షోలో కూడా మరింత పాపులర్ కి దక్కించుకుంటున్నారు బాలయ్య. ఏది ఏమైనా ఈ ఏడాది బాలయ్యకు బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు.