ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగబోతున్న చిత్రాల్లో `వారసుడు(తమిళంలో వారిసు)` ఒకటి. కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు నిర్మించారు.
ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ స్వరాలు అందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు ఈ సినిమాకు విజయ్ దళపతి అందుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది.
సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాలు ప్రకారం.. వారసుడు చిత్రానికి దళపతి ఏకంగా రూ. 105 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకున్నారట. ఇక జీఎస్టీతో కలిపి మొత్తం గా ఆయనకు మేకర్స్ రూ. 120 కోట్లకు పైగా ముట్టచెప్పారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. విజయ్ కెరీర్ లో ఇదే హైయెస్ట్ రెమ్యునరేషన్ అని అంటున్నారు. ఇక విజయ్ రెమ్యునరేషన్ తెలిసి నెటిజన్లు కళ్లు తేలేస్తున్నారు. ఏదేమైనా ఒక్క సినిమాకు అన్ని కోట్ల రెమ్యునరేషన్ అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.