పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన పార్టీ కార్యక్రమాలలో చాలా బిజీగా పాల్గొంటున్నారు. గతంలో మూడు సంవత్సరాల నుంచి సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ మళ్లీ కొన్ని కారణాల చేత సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చారు. అలా వకీల్ సాబ్ చిత్రంతో రీ యంట్రి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అందుకోసం దర్శక, నిర్మాతలు కూడా అడ్వాన్సులు కూడా ఇవ్వడం జరిగింది. హరిహర వీర మల్లు సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.
ఈ చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఎన్నో నెలలు కావస్తున్న ఇంతవరకు ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పొలిటికల్ షెడ్యూల్లో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా షూటింగులు కాస్త ఆలస్యం అవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ మరొక డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించినట్లు నిన్నటి రోజున అధికారికంగా ప్రకటించారు. పవన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలను ఒప్పుకోవడానికి గల కారణం ఏంటనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.
అయితే పవన్ కళ్యాణ్ కేవలం పార్టీ నడపడం కోసమే సినిమాలను అంగీకరిస్తున్నట్లు అందుకోసం అడ్వాన్సులు కూడా తీసుకుంటున్నట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.ఇటీవల పవన్ కళ్యాణ్ ఈ వార్తలను నిజం చేస్తూ పాస్ చేసిన స్టేట్మెంట్ ఇందుకు అర్థమవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇతరుల విరాళాలతో తాను పార్టీని నడపడం లేదని కేవలం తన సొంత ఖర్చులతో పార్టీని నడుపుతున్నారని ప్రకటించడం జరిగింది. దీంతో పవన్ కళ్యాణ్ కేవలం 2024 ఎన్నికల ఖర్చు ని దృష్టిలో పెట్టుకొని సినిమాలను పూర్తి చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.