ఈమధ్య కాలంలో థియేటర్లలలో ప్రేక్షకులకు రప్పించాలి అంటే ముఖ్యంగా కంటెంట్ బాగా ఉంటే ప్రేక్షకులు వస్తున్నారు. లేకపోతే ఎలాంటి స్టార్ హీరోలు సినిమాలైనా సరే తిరస్కరిస్తూ ఉన్నారు ప్రేక్షకులు. ముఖ్యంగా హీరో డైరెక్టర్ భారీ నిర్మాణ విలువలతో సినిమాలను నిర్మించే సంస్థలు కూడా ఈ మధ్యకాలంలో కాస్త భయపడుతూ ఉన్నారు. కంటెంట్ నచ్చితే కొత్త హీరో, డైరెక్టర్ అని తేడా లేకుండా చూస్తూ ఉన్నారు ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో హీరో రవితేజకు కూడా బిగ్ షాక్ తగిలినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
వరస సినిమాలలో నటిస్తున్న రవితేజకు తమిళ హీరో విష్ణు విశాల్ తో మంచి అనుబంధం ఏర్పడింది.ఆ అనుబంధంతోనే తాను నటించిన సినిమాలన్నీ రవితేజ తెలుగులో సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆ మధ్య విష్ణు విశాల్ నటించిన FIR మూవీకి తెలుగులో రవితేజ సమర్పిడిగా వ్యవహరించారు. ఈ సినిమాని మను ఆనంద్ డైరెక్టర్ గా తెరకెక్కించారు. ఈ చిత్రంలో విష్ణు విశాల్ ఒక ముస్లిం యువకుడిగా అద్భుతంగా నటించారు. ఈ సినిమా ఎంతోమంది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కానీ సరైన పబ్లిసిటీ లేకపోవడంలో విష్ణు విషయాలు తెలుగులో పెద్దగా తెలియకపోవడంతో ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టు లేకపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.
మొదటిసారి సమర్పకుడిగా రవితేజ వ్యవహరించిన ఈ సినిమా తొలి ప్రయత్నంలోనే షాక్ ఇచ్చింది. రీసెంట్గా విష్ణు విశాల్ నటించిన మరొక చిత్రం మట్టి కుస్తీ ఈ సినిమా గత శుక్రవారం విడుదల కావడం జరిగింది.ఈ సినిమాకి చల్లా అయ్యావు దర్శకత్వం వహించారు. తమిళ కుస్తీ పోటీల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం బాగానే ఉన్న ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. మొదటి రోజు మంచి టాక్ని సొంతం చేసుకున్న తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని పెద్దగా పట్టించుకోలేదన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ మరొకసారి నిర్మాతగా విఫలమయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి.