వీర సింహ రెడ్డి పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన థ‌మ‌న్‌..!

అఖండ హిట్ త‌ర్వ‌త న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న తాజా సినిమా వీరసింహారెడ్డి. ఈ సినిమా షూటింగ్ కూడా చివ‌రి ద‌శ‌కు వ‌చ్చింది. ఇక నిన్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కుడా చిత్ర యునిట్ ప్ర‌క‌టించింది. ఈ సినిమాను వ‌చ్చే సంక్రాంతి కానుగా జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేయడంతో ఈ సినిమా పై ప్రేక్ష‌కుల‌లో ఒక్క‌సారిగా భారీ అంచాన‌లు పెరిగిపోయాయి.

Veera Simha Reddy (2023) movie: Cast | Trailer | OTT | Songs | Release Date - News Bugz

ఈ సినిమా టెక్నికల్ వ‌ర్క్‌ కూడా ఎంతో శరవేగంగా జ‌రుగుతుంది. ఈ సినిమా సంగీత దర్శకుడు ఎస్ఎస్‌. థమన్ అదిరిపోయే అప్డేట్ బ‌య‌ట‌కి వ‌దిలాడు. ఈ సినిమా పాట‌లు మొత్తం కంప్లిట్ అయ్యి.. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వ‌ర్క్ మొద‌లు పెట్టామ‌ని చెప్ప‌డంతో పాటు జై బాలయ్య‌ అంటూ పోస్ట్ పెట్టాడు. అలాగే ఆ పోస్ట్ లో అ సినిమా ద‌ర్శ‌కుడు గోపిచంద్ మ‌లినేని, మ‌రియు సాహిత్య ర‌చ‌య‌త రామజోగయ్య శాస్త్రితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశాడు.

Veera Simha Reddy Jai Balayya Mass Anthem Lyric Nandamuri Balakrishna Shruti Haasan Thaman S NBK - YouTube

అఖండ త‌ర్వాత బాల‌య్య, థ‌మ‌న్ క‌లిసి చేస్తున సినిమా వీర‌సింహారెడ్డి. ఈ సినిమాకు కూడా థ‌మ‌న్ అఖండ‌ను మించి అదిరిపోయే మ్యూజిక్ ఇస్తాడ‌ని బాల‌య్య అభిమ‌నులు భావిస్తున్నారు. ఇప్ప‌టికే జై బాల‌య్య సాంగ్ ఊపేస్తోంది. రేపు థియేట‌ర్ల‌లో కూడా థ‌మ‌న్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్‌తో ద‌ద్ద‌రిల్లిపోయేలా చేస్తాడ‌నే అంటున్నారు. శృతీహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

.

Share post:

Latest