మాచర్ల అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అడ్డా అని చెప్పవచ్చు..ఇక్కడ అపోజిట్‌లో ఎవరు నిలబడిన వారిని ఓడించడం మాచర్ల ప్రజలకు అలవాటైన పని. తమకు అండగా నిలబడే పిన్నెల్లిని ఎప్పుడు గెలిపిస్తూ ఉంటారు. అయితే గత ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీతో పిన్నెల్లి గెలిచారు. పైగా వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో టీడీపీకి చుక్కలు కనబడుతున్నాయి. ఒకానొక దశలో టీడీపీకి బలమైన నాయకుడు కూడా లేరు. ఇక వరుసపెట్టి టీడీపీ శ్రేణులపై దాడులు జరుగుతూ వచ్చాయి.
ఇదే సమయంలో టీడీపీకి ఇంచార్జ్‌ఏజి జూలకంటి బ్రహ్మరెడ్డిని ఇంచార్జ్ గా పెట్టారు. అక్కడ నుంచి టీడీపీలో దూకుడు పెరిగింది. జూలకంటి ప్రజల్లో తిరగడం మొదలుపెట్టారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. అయితే టీడీపీని వైసీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి..ఇదే క్రమంలో తాజాగా ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని మాచర్ల పట్టణంలో జూలకంటి నిర్వహిస్తున్నారని, ఈ క్రమంలోనే తమవైపు రావద్దని కొందరు వైసీపీ శ్రేణులు వారించారు. ఇటు టీడీపీ శ్రేణులు పోటీగా నిలబడ్డాయి.
అదే సమయంలో వైసీపీ శ్రేణులు రాళ్ళు రువ్వారు..దీంతో టీడీపీ శ్రేణులు కూడా ప్రతిఘటించి..వైసీపీ శ్రేణులపై దాడులు చేశాయి. అయితే పోలీసులు టీడీపీ శ్రేణులని అడ్డుకున్నారు..జూలకంటిని అదుపులోకి తీసుకున్నారు. జూలకంటిని అదుపులోకి తీసుకోగానే..వైసీపీ శ్రేణులు..ఇళ్లకు వెళుతున్న టీడీపీ శ్రేణులపై దాడులు చేశాయని తెలిసింది. అటు టీడీపీ నేతల వాహనాలు, ఆఫీసుకు నిప్పు పెట్టారు. మొత్తానికి ఇలా మాచర్ల రగిలింది.
అయితే ఇదంతా చంద్రబాబు, లోకేశ్, జూలకంటి స్క్రిప్ట్ అని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఫైర్ అయ్యారు. కాకపోతే అక్కడ ఏం జరిగిందో..అక్కడ ప్రజలకే బాగా క్లారిటీ ఉందని చెప్పవచ్చు. కానీ ఇక్కడ టీడీపీకి బలం లేదని వైసీపీ భావిస్తుంది..అలాంటప్పుడు టీడీపీ కార్యక్రమాలని అడ్డుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదని చెప్పవచ్చు. మరి మాచర్లలో ఏమన్నా రాజకీయ పరిస్తితులు మారుతున్నాయా? అనేది క్లారిటీ లేదు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు బట్టే తెలుస్తుందని చెప్పవచ్చు.