వావ్: బాలీవుడ్ లో తాప్సీ అరుదైన రికార్డ్.. శభాష్ సొట్టబుగ్గల సుందరి..!!

ప్రజెంట్ తాప్సి ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో సంబరాలు చేసుకుంటున్నారు. దానికి మెయిన్ రీజన్ తాప్సి ఏకంగా మూడోసారి కూడా బెస్ట్ హీరోయిన్ గా ఫిలింఫేర్ అవార్డు అందుకోవడమే. మనకు తెలిసిందే “ఝుమ్మంది నాదం” అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయమైన తాప్సి ..ఆ తరువాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారిపోయింది.

హిట్లు తక్కువ కొట్టినప్పటికీ ..కంటెంట్ ఉన్న సినిమాలో నటిస్తూ తాప్సి తన నటనకు ప్రత్యేక ముద్ర వేయించుకుంది . ఈ క్రమంలోనే బాలీవుడ్లో సైతం అవకాశాలు అందుకుంటూ వచ్చిన తాప్సి ..ప్రజెంట్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది. కంటెంట్ ఉన్న సినిమాలో నటిస్తున్న తాప్సి రీసెంట్గా 2022 ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు ను అందుకుంది.

గత రెండు సంవత్సరాలుగా వరూసాగా ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్న తాప్సీ.. బాలీవుడ్ లో తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది. 2020 సంవత్సరానికి గాను సాండ్‌ కీ ఆంఖ్‌.. 2021 సంవత్సరానికి గాను థప్పడ్‌ సినిమాకు వరుసగా అవార్డ్స్ అందుకున్న తాప్సీ,… ఉత్తమ నటిగా ముచ్చటగా మూడో సారి 2022 కు గాను ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. 2022వ సంవత్సరానికి గాను ఒరిజినల్ ఫిలిం లూప్‌ ఉత్తమ నటిగా ఫిలింఫేర్ ఓటిటి అవార్డును అందుకుంది . ఈ క్రమంలోని తాప్సి బాలీవుడ్ లో సంచలన రికార్డు నెలకొల్పినట్లు అయింది. దీంతో తాప్సి ఫ్యాన్స్ ఫుల్ సంబరాలు జరుపుకుంటున్నారు.

Share post:

Latest