తమన్నా టోటల్ ఆస్తుల విలువెంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. స్టార్ హీరోలు కూడా వేస్ట్..!!

ఇండస్ట్రీ లోకి ఎప్పుడు వచ్చాము అన్నది కాదు ఆస్తి సంపాదించుకున్నామా లేదా అదే పాయింట్ .. ఇప్పుడు హీరోయిన్స్ ఫిలాసఫీగా పెట్టుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో హీరోలకు మించిన రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్లు బోలెడు మంది ఉన్నారు . గతంలో లాగా సినిమా అంటే హీరోలే ..హీరోయిన్స్ కేవలం గ్లామరస్ పాత్రలకే అన్న మాటలను తుడిచి పెట్టేసి.. లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనే పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొడుతున్నారు .

దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్ లో నటించిన యశోద మూవీనే. ఈ సినిమాలో ఏ హీరో లేడు . కేవలం కంటెంట్ తోనే సమంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది . ఇలా వరుస సినిమాలతో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్న స్టార్ హీరోయిన్స్లలో తమన్నా కూడా ఒకరు . కాగా తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమే అవుతుంది . ఇప్పటికీ హీరోయిన్స్ గా అరాకోరా సినిమాలు చేస్తుంది .

అయితే ఆమె ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆమె ఆస్తి విలువ ఎక్కువ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అందుతున్న సమాచారం ప్రకారం సినిమా ఇండస్ట్రీలోనే ఏ హీరోయిన్ దగ్గర లేని అంత ఆస్తి తమన్న దగ్గర ఉందట . అంతేకాదు తమన్నా దగ్గర కొన్ని వజ్రాలు ఉన్నాయని ..ఆ వజ్రాలను భద్రంగా లాకర్లో దాచిపెట్టింది అన్న రూమర్ గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంది . అంతేకాదు తమన్నాకి హైదరాబాద్లో , ముంబైలో, బెంగళూరులో ఫ్లాట్లు , ఇల్లులు ఉన్నాయట . అంతేకాదు విదేశాలలో కొన్ని వ్యాపారాల్లో షేర్లు కూడా పెట్టిందట . మొదటి నుంచి టాలెంటెడ్ అయిన తమన్నా సంపాదించిన ప్రతి రూపాయిని బిజినెస్ పరంగా డబల్ చేస్కుందన్న న్యూస్ వైరల్ గా మారింది.