`సర్కారు వారి పాట` హిట్ అనంతరం టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన తదుపరి చిత్రాన్ని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ ప్రారంభం అయ్యేలోపే మహేష్ ఇంట్లో వరుస విషాదాలు నెలకొన్నాయి. అయితే ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ మొత్తం స్క్రిప్ట్ ను మార్చేశారు. స్క్రిప్ట్ మారడం వల్ల ఈ సినిమా షూటింగ్ ను మళ్లీ కొత్తగా ప్రారంభించబోతున్నారు.
అందుకు ఏర్పాట్లు అన్ని జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నైట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే ఈ చిత్రంలో ప్రముఖ టాప్ సింగర్ సునీత నటించబోతుందట. ఇందులో మహేష్ బాబు అక్క పాత్ర కోసం త్రివిక్రమ్ సునీతను సంప్రదించగా.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారమే నిజమైతే సునీత డబ్యూ మూవీ ఇదే అవుతుంది.