టాలీవుడ్ సంక్రాంతి సినిమాల గొడవ ఫిలిం చాంబర్ దాకా వెళ్ళింది… దిల్ రాజు ఇప్పుడు ఏమంటాడో?

గత కొన్ని రోజులుగా టాలీవుడ్లో జరుగుతున్న రచ్చ గురించి తెలిసినదే. సంక్రాంతి కోడిపందేల మాదిరి సంకాంత్రి సినిమాల సందడి గురించి ఇపుడు పెద్ద చర్చ నడుస్తోంది. అవును, సంక్రాతి అంటేనే పెద్ద సినిమాల హడావుడి ఉంటుంది. ఎందుకనే విషయం అందరికీ విదితమే. పండగ రోజుల్లో ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్‌ క్యాష్ చేసుకునేందుకు ఫిలిం మేకర్స్ సంక్రాంతి టార్గెట్‌గా పెద్ద పెద్ద సినిమాలను ప్లాన్స్ చేసుకుంటూ వుంటారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సైతం చాలా సంవత్సరాలుగా తమ బ్యానర్‌ నుంచి ఖచ్చితంగా ఒక సినిమాను సంక్రాంతి బరిలో నిలపడం ఆనవాయితీగా వస్తోంది.

ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. అవును, ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవి‘వాల్తేర్ వీరయ్య’తో పాటు నందమూరి బాలకృష్ణ ‘వీరసింహా రెడ్డి’ చిత్రాలు గట్టిగా పోటీపడుతున్నాయి. ఇది ఎప్పుడు ఉండేదే… వీరిద్దరి సినిమాలు బేసిగ్గా సంక్రాతి బరిలో పడుతూ ఉంటాయి. ఇక్కడే వుంది అసలు ట్విస్ట్. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో నిర్మించిన ‘వారిసు’ మూవీ రిలీజ్ కూడా సంక్రాతి అనుకుంటున్నారు. ఈ విషయంలోనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

స్ట్రెయిట్ తెలుగు చిత్రాలకు కాకుండా ఈ బైలింగువల్ మూవీకి ఎక్కువ సంఖ్యలో తెలుగులో థియేటర్లు కేటాయించడంపై ప్రస్తుతం పంచాయితీ ఫిలిం చాంబర్ వరకు వెళ్ళింది. ఇక దిల్ రాజు గురించి అందరికీ తెలిసినదే. నైజాం సహా వైజాగ్ ఏరియాలో ఆయనికి థియేటర్లపై మంచి స్ట్రాంగ్ కమాండ్ ఉంది. దీంతో తన సినిమాకు రికార్డ్ సంఖ్యలో థియేటర్లు బ్లాక్ చేసినట్లు గుసగుసలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైజాగ్‌కు చెందిన ఎగ్జిబిటర్స్.. ఫిలిం చాంబర్‌ను అశ్రయించినట్టు సమాచారం. ఇక విషయం ఎంతవరకు వెళ్తుందో చూడాలి మరి!