మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, `ఉప్పెన` ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ మూవీ అనంతరం గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ ఈ ప్రాజెక్ట్ అనూహ్యంగా ఆగిపోయింది. దీంతో గౌతమ్ తిన్ననూరి స్థానంలో బుచ్చిబాబు చేరాడు. వీరి కాంబో ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది.
వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కబాడ్డీ నేపథ్యంతో ఈ సినిమాను రూపొందించబోతున్నారట. ప్రీ ప్రొడెక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఇప్పుడు ఈ మూవీ బడ్జెట్ హాట్ టాపిక్ గా మారింది.
ఈ సినిమా కోసం ఏకంగా రూ. 300 కోట్ల బడ్జెట్ ను పెడుతున్నారట. బుచ్చిబాబుకు ఇది రెండవ చిత్రం. పైగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను హ్యాండిల్ చేసిన అనుభవం ఆయనకు లేదు. అయినా సరే ఆయన్ను నమ్మి ఇంత భారీ బడ్జెట్ పెట్టడం పై నెటిజన్లు మరియు సినీప్రియలు నోరెళ్లబెడుతున్నారు.