ప‌వ‌న్‌కు ఊహించ‌ని సర్ప్రైజ్ ఇచ్చిన ప్ర‌భాస్‌.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్‌!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, `సాహో` ఫేమ్ సుజిత్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. నేడు ఈ ప్రాజెక్టు పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ సందర్భంగా `ఆయన్ను ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అంటారు` అనే క్యాప్షన్ తో ప‌వ‌న్ ప్రీ లుక్ ను కూడా బయటకు వదిలారు.

పవన ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని సుజిత్‌ ఓ స్టైలిష్ యాక్షన్ స్క్రిప్ట్ ను డిజైన్ చేశాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. `ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే.. తాజాగా పవన్ కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. పవన్‌-సుజిత్‌ ప్రాజెక్ట్ పై ప్రభాస్‌ స్పందిస్తూ ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టారు.

`పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, డైరెక్టర్ సుజిత్ కి కంగ్రాట్స్. ఈ కాంబినేషన్ ఒక విస్ఫోటనంలా మారడం ఖాయం. దానయ్య గారికి చిత్ర యూనిట్ కి నా బెస్ట్ విషెస్ తెలుపుతున్నా` అంటూ ప్రభాస్ త‌న పోస్ట్ లోపేర్కొన్నారు. ఊహించని వ్యక్తి నుంచి ఊహించని పోస్ట్ రావడంతో పవన్ అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. కాగా సుజిత్ తో ప్రభాస్ `సాహో` సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సౌత్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా నార్త్ లో మాత్రం మంచి విజయం సాధించింది.

Share post:

Latest