బాలీవుడ్కండల వీరుడు సల్మాన్‌ఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజిగా ఉన్నడు. బాలీవుడ్ సినిమాలు గత కొంత కాలంగా ప్రేక్షకులను మెప్పించ లేక పోతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోలు నటించిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ సినిమాలుగా మిగిలి పోతున్నాయి. సౌత్ సినిమాలు బాలీవుడ్ హీరోలకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. రీసెంట్గా సౌత్ నుంచి రీలిజ్ అయిన సినిమాలు బాలీవుడ్ లో భారీ కలెక్షన్లు రాబట్టుకున్నాయి.
ఇప్పుడు బాలీవుడ్ హిరోలు కూడా సౌత్ సినిమాలపై మనసు పడేసుకున్నారు. తాజాగా సల్మాన్ కూడా చిరంజీవి హిరోగా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాలో ప్రత్యేక ప్రాతలో నటించి అలరించాడు. మరో బాలీవుడ్ స్టార్ హీరో అయిప షారుక్ సౌత్ స్టార్ దర్శకుడు అయిన అట్లీ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున విషయం తెలిసిందే. పైగా ఈ సినిమాలో నయనతార హీరోయిన్. ఇప్పుడు మరో బాలీవుడ్ క్రేజి సినిమా గురించి అదిరిపోయే ఆప్‌డ్ట్ వచ్చింది.
సల్మాన్ నటించిన కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమాను 2023 ఈద్ రోజున థియేటర్లలోకి రానుందని ప్రకటిస్తూ తాజాగా ఓ వీడియో ద్వారా వెల్లడించారు. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హిరో విక్టరీ వెంకటేష్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ అయితే త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో మరో మల్టీస్టారర్ సినిమా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
వెంకటేష్ మల్టీస్టారర్ సినిమాలకు ముందే ఉంటాడు. రీసెంట్గా వచ్చిన చిన్న హీరో సినిమా ఓరీదేవుడా సినిమాలోనూ కీలక పాత్రలో నటించాడు. మరి వెంకీ – సల్మాన్ మల్టీస్టారర్ అంటే మామూలు రచ్చ కాదనే చెప్పాలి.