టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన కెరియర్ను ముందుగా చిత్ర పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్ గా ప్రారంభించారు. సినిమా పరిశ్రమలోకి రాకముందు దిల్ రాజు ఆటోమొబైల్ బిజినెస్ చేసేవారు. ఆ బిజినెస్ లో కూడా ఆయన చాలా లాభాలు పొందారు. ఆ తర్వాత సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేయటం మొదలుపెట్టారు. సినిమా పరిశ్రమంలో ఆయన కెరియర్ అంత సాఫీగా నడవలేదు. తొలి సినిమాతోనే పెట్టిన డబ్బు మొత్తం పోగొట్టుకున్నాడు.
తర్వాత కొన్ని రోజులకు పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన తొలిప్రేమ సినిమాతో దిల్ రాజుకు లాభాలు వచ్చాయి. 1998 లో పవన్ కళ్యాణ్ హీరోగా కీర్తి రెడ్డి హీరోయిన్ గా తొలిప్రేమ సినిమా విడుదల అయింది. ఈ సినిమా నైజాం హక్కులను దిల్రాజు రూ.72 లక్షలకు కొన్నారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే సూపర్ హిట్ సినిమాల్లో ఒక సినిమాగా నిలిచింది. ఈ సినిమా నైజాంలో ఏకంగా రూ.2.80 కోట్ల కలెక్షలను రాబట్టి డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండించింది.
ఈ సినిమా నైజాంలో ఒక్క థియేటర్ నుండే రూ.72 లక్షల కలెక్షన్లను రాబట్టింది. ఆ థియేటర్ ఏమిటంటే హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్. తొలిప్రేమ ఏకంగా 200 రోజులు ఆడి దిల్ రాజు పెట్టిన పెట్టుబడి మొత్తం ఆ థియేటర్ కలెక్షన్ ద్వారానే వచ్చిందని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు చెప్పాడు. దిల్ రాజు టాలీవుడ్లో అగ్ర నిర్మాతగా కొనసాగడానికి పవన్ కళ్యాణ్ తొలిప్రేమ కారణమని ఆయన చెప్పుకొచ్చాడు.