న‌టసింహంతో ప‌వ‌ర్ స్టార్‌.. ఇంత‌కీ ఇద్ద‌రూ ఎక్క‌డ క‌లిశారో తెలుసా?

నందమూరి హీరో, మెగా హీరో ఓకే ఫ్రేమ్ లో కనిపిస్తే అభిమానులకు కన్నుల పండగే. అలాంటి అరుదైన సందర్భమే తాజాగా చోటుచేసుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `వీర సింహారెడ్డి` సినిమా చేస్తున్న సంగతి తెలిసింది.

ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుక జనవరి 12న ఈ చిత్రం విడుదల కాబోతోంది. టాకీ కంప్లీట్ మొత్తం కంప్లీట్ అయింది. ఇంకా ఒక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ప్రస్తుతం ఆ సాంగ్ ను చిత్రీకరించే పనిలోనే మేకర్స్ ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియోలో ఈ సాంగ్ కోసం సెట్ వేశారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ నేతృత్వంలో బాల‌య్య‌, శ్రుతి హాస‌న్ ల‌పై ఈ సాంగ్ ను షూట్ చేస్తున్నారు.

అయితే అక్కడికి పవన్ క‌ళ్యాణ్‌ వెళ్ళారు. ఆయనతో పాటు `హరి హర వీర మల్లు` దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, నిర్మాత ఏయం రత్నం ఉన్నారు. కాసేపు హీరోలు ఇద్దరూ సరదాగా ముచ్చటించుకున్నారు. `వీరసింహారెడ్డి` సెట్‌లో `హరిహర వీరమల్లు` యూనిట్‌ సందడి చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా దిగిన ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ పిక్ ను అభిమానులు తెగ మురిసిపోతున్నారు.

https://www.instagram.com/p/CmgyH72SsQu/?utm_source=ig_web_copy_link