ఎట్ట‌కేల‌కు కొత్త ప్రాజెక్ట్‌కు సైన్ చేసిన మృణాల్‌.. ఇంత‌కీ హీరో ఎవ‌రో తెలుసా?

ఈ ఏడాది `సీతారామం` సినిమాతో తెలుగు తెలుగు పరిచయమైన మృణాల్ ఠాకూర్‌ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తొలి సినిమాతోనే ఇక్కడ స్టార్ హోదాను అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. సీతారామం విడుదలై ఇన్ని నెలలు గ‌డుస్తున్న కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన ఒక్క అనౌన్స్మెంట్ కూడా ఇవ్వ‌లేదు.

దీంతో మృణాల్ రెమ్యున‌రేష‌న్ భారీగా పెంచేసిందని, అలాగే గొంతెమ్మ‌ కోరికలన్నీ కోరుతుందని.. అందుకే ఆమెకు ఆఫర్లు రావడం లేదని ప్రచారం జరిగింది. కానీ లేటెస్ట్ సమాచారం ప్రకారం.. మృణాల్ ఎట్టకేలకు తాజాగా ఓ ప్రాజెక్ట్ కు సైన్ చేసిందట. సీతారామం త‌ర్వాత ఈ ముద్దుగుమ్మ న్యాచుర‌ల్ స్టార్ నానితో రొమాన్స్ చేయ‌బోతోంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం `ద‌స‌రా` సినిమా చేస్తున్న నాని.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని న్యూ ఇయర్ రోజున అనౌన్స్ చేయ‌బోతున్నాడు.

ఇది నాని కెరీర్ లో తెర‌కెక్కబోయే 30వ చిత్రం. జనవరి 1వ తారీఖున సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు ఈ ప్రాజెక్ట్ పై అధికారికంగా ప్రకటన రానుంది. చిత్ర దర్శకుడు మరియు హీరోయిన్ ఇతర విషయాల గురించి రేపు అనౌన్స్ చేయ‌బోతున్నారు. అయితే వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 1 గా నిర్మితం కానున్న ఈ చిత్రంలో మృణాల్ హీరోయిన్ గా ఎంపిక అయింద‌ట‌. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు సైతం పూర్తి అయ్యాయ‌ని తెలుస్తోంది.