మహేష్-రాజమౌళి మూవీపై న‌యా అప్డేట్‌.. అదే జ‌రిగితే ఫ్యాన్స్ కి పండ‌గే!

దర్శక ధీరుడు రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయిన వెంటనే రాజమౌళి సినిమా పట్టాలెక్కనుంది.

ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. రాజమౌళి తండ్రి, ప్ర‌ముఖ స్టార్‌ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్ల‌బోతోంది. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఈ మూవీపై విజయేంద్ర ప్రసాద్ నయా అప్డేట్ ఇచ్చారు. ఇది అడ్వెంచర్ స్టోరి అని, వచ్చే ఏడాదిలో ప్రారంభం కానుంద‌ని విజ‌యేంద్ర ప్ర‌సాద్ పేర్కొన్నారు.

అలాగే ఈ సినిమాను ఫ్రాంచైజీగా డెవలప్ చేస్తున్నట్లు ఆయ‌న తెలిపారు. దీంతో ఈ సినిమాకు సీక్వెల్స్ వస్తాయా అని ఓ యాంకర్ అడగ్గా.. అందుకు ఆయ‌న `సీక్వెల్స్ ఖ‌చ్చితంగా వస్తాయి. ఈ సీక్వెల్స్ కథ మారుతున్నప్పటికీ ప్రధాన పాత్రలు మాత్రం అలాగే ఉంటాయి. మొదటి భాగానికి సంబంధించిన స్క్రిప్ట్ ను పూర్తిచేసే పనిలో ఉన్నాను` అంటూ చెప్పుకొచ్చారు. మ‌రి నిజంగానే సీక్వెల్స్ వ‌స్తే మ‌హేష్ ఫ్యాన్స్‌కు పండ‌గే అవుతుంది.