చిరంజీవికి అభిమానుల సెగ‌.. ఆ మూవీ ఆపాలంటూ డిమాండ్‌!

మెగాస్టార్ చిరంజీవికి సొంత అభిమానుల నుంచే సెగ తగులుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత కొంతకాలం నుంచి టాలీవుడ్ లో రీమేక్ సినిమాలో హడావుడి బాగా పెరిగింది. కానీ ఓటీటీలు వచ్చాక రీమేక్ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. అయినా సరే మెగాస్టార్ చిరంజీవి రీమేక్ సినిమాలను వదిలిపెట్టడం లేదు.

అలా రీసెంట్ గా ఈయన నుంచి వచ్చిన రీమేక్‌ చిత్రమే `గార్డ్ ఫాదర్`. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో తెలిసిందే. టాక్ పాజిటివ్ గా వచ్చిన థియేటర్స్ లో ఈ సినిమాకు ప్రేక్షకులు కరువయ్యారు. ఇక ఇప్పుడూ చిరంజీవి చేతిలో మరో రీమేక్‌ ఉంది. అదే `భోళా శంకర్`. తమిళ సూపర్ హిట్ `వేదాళం`కు రీమేక్ ఇది.

సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కీర్తి సురేష్ చిరంజీవి సోదరిగా కనిపించబోతోంది. హీరోయిన్గా తమన్నా ఫిక్స్ అయింది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించునున్న ఈ చిత్రం త్వరలోనే ప‌ట్టాలెక్క‌నుంది. ఇలాంటి తరుణంలో మెగా అభిమానులు భోళా శంక‌ర్‌ మూవీ ని ఆపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ సినిమా చేయొద్దు బాస్ అంటూ చిరంజీవికి రిక్వెస్ట్ చేస్తున్నారు. `స్టాప్ భోళా శంకర్` అంటూ సోషల్ మీడియా వేదికగా హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్‌ చేస్తున్నారు. మరి అభిమానుల గోడును చిరంజీవి పట్టించుకుంటారా లేదా అన్నది చూడాలి.

Share post:

Latest