మహేష్ కు విలన్ గా రావణాసురుడు.. ఈ స్కెచ్ మామూలుగా లేదుగా..!

మహేష్ బాబు తన తాజా చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రంతో చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయింది. ఈనెల8 నుంచి ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. గత కొద్దిరోజులుగా ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ నటిస్తున్నాడని ఓ టాక్ నడిచింది.

అయితే ఇప్పుడు ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ హీరో విలన్ గా కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ను మహేష్ కు విలన్ గా మేకర్స్ కన్ఫర్మ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ ఈ సినిమాలోనే చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. సైఫ్ అలీ ఖాన్ ఇప్పటికే ఆదిపురుష్‌ సినిమాలో రావణాసుడుగా నటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మహేష్ సినిమాలో కూడా అతను ఒప్పుకుంటే ఈ సినిమాకు బాలీవుడ్ లో కూడా భారీ అంచనాలు క్రియేట్ అవుతాయి.

New updates on Mahesh-Trivikram film!

త్రివిక్రమ్ ఈ సినిమాలో నటీనటులను ఎంపిక చేస్తున్న విధానం ఎంతో ఆసక్తికరంగా ఉంది. 11 సంవత్సరాలు తర్వాత త్రివిక్రమ్‌- మహేష్ కాంబోలో వస్తున్న సినిమామా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఈ సినిమాలో మహేష్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తుంది. మహేష్ ఈ సినిమాతో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తారు చూడాలి.

Share post:

Latest