టాలీవుడ్ లో దర్శకుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి ఇప్పటివరకు ఫ్లాప్ అనే సినిమాని తెరకెక్కించలేదని చెప్పవచ్చు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నో చిత్రాలను తెరకెక్కించడంతోపాటు తెలుగు సినిమా ఖ్యాతిని అమాంతం పెంచేసిన దర్శకుడుగా పేరు సంపాదించారు. బాహుబలి, RRR వంటి చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాంటిది రాజమౌళి దర్శకత్వంలో ఎవరైనా నటించాలంటే ఎగిరి గంతేస్తూ ఉంటారు. అలాంటిది రాజమౌళి సినిమాలని రిజెక్ట్ చేసిన కొంతమంది హీరోల గురించి తెలుసుకుందాం.
1). పవన్ కళ్యాణ్:
విక్రమార్కుడు సినిమాని మొదట పవన్ కళ్యాణ్ తో అనుకోగా ఆ సినిమాని రిజెక్ట్ చేశారట.
2). మోహన్ లాల్:
బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రని మోహన్ లాల్ చేయమని అడగగా బిజీగా ఉండే షెడ్యూల్ కారణంగా ఈ పాత్రను వదిలేయవలసి వచ్చిందట.
3). జాన్ అబ్రహం:
బాహుబలి చిత్రంలో బల్లాల దేవుడు పాత్ర కోసం జాన్ అబ్రహంని అడగగా కొన్ని కారణాల చేత ఒప్పుకోలేదట.
4). వివేక్ ఒబేరామ్:
బాహుబలి సినిమాలో కూడా బల్లాల దేవుడి పాత్ర కోసం వివేక్ ఒబెరాయ్ ని అడగగా కొన్ని కారణాల చేత ఒప్పుకోలేదట.
5). సూర్య:
బాహుబలి చిత్రంలో ఒక కీలకమైన పాత్ర కోసం సూర్యని అడిగగా అందుకు అంగీకరించలేదట.
6). హృతిక్ రోషన్:
బాహుబలి చిత్రంలో హీరోగా నటించాలనుకున్నారట కానీ అది జరగలేదు.
7). ప్రభాస్:
ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమాని ప్రభాస్ ను చేయమని అడగగా అందుకు ఒప్పుకోలేదట.
8). అమితాబ్ బచ్చన్:
బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్రని అమితాబచ్చన్ ని చేయమని చెప్పగా ఒప్పుకోలేదట.
9). శ్రీదేవి:
బాహుబలి చిత్రంలో రమ్యకృష్ణ చేసిన శివగామి పాత్రని శ్రీదేవిని చేయమని అడగగా అందుకు ఒప్పుకోలేదట.
10). శ్రద్ధా కపూర్:
RRR సినిమాలో ఒలీవియా మోరిస్ చేసిన జెన్ని పాత్ర కోసం ఈ ముద్దుగుమ్మని అడగక అందుకు ఒప్పుకోలేదట.
11). కాజల్:
యమదొంగ సినిమాలో హీరోయిన్ గా అనుకున్న ఈమె ఒప్పుకోలేదట.
12). బాలకృష్ణ:
మగధీర సినిమాలో ముందుగా బాలకృష్ణని అనుకోగా బాలకృష్ణ ఒప్పుకోలేదట.