`స‌లార్‌`పై న‌యా అప్డేట్‌.. ఇది వింటే డార్లింగ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్టుల్లో `సలార్` ఒకటి. కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రల‌ను పోషిస్తున్నారు.

హొంబాలే ఫిల్మ్స్‌ బ్యానర్ పై భారీ బ‌డ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో విజయ కిరాగందుర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాపై న‌యా అప్డేట్ బయటకు వచ్చింది. ఈ అప్డేట్ వింటే డార్లింగ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఈ మూవీ షూటింగ్ ఆఖ‌రి ద‌శ‌కు చేరుకుంది. అవును, 85 శాతం షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరంగందుర్ స్పష్టం చేశారు.

 

`స‌లార్ షూటింగ్‌ 85 శాతం వరకు అయిపోయింది. జనవరి ముగిసే లోపు మిగిలిన షూటింగ్ పూర్తవుతుంది. వీఎఫ్ఎక్స్ కోసం కనీసం 6 నెలల సమయం పడుతుంది. కాబట్టి సెప్టెంబరు 28న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ అధిగమిస్తుంది. ఎందుకంటే ఈ కథకు ఆ సత్తా ఉంది.` విజయ్ కిరంగందుర్ పేర్కొన్నారు. ఈ అప్డేట్ తో ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.