అల్లుడు కావాల్సిన హీరోని ..అడుక్కుతినేలా చేసిన కమల్ హాసన్..!!

లోకనాయకుడు కమల్ హాసన్ గురించి ఎంత చెప్పినా తక్కువే .. మల్టీ టాలెంటెడ్ సూపర్ యాక్టివ్ ..హ్యాండ్ సమ్ హీరో ..రొమాంటిక్ లవర్ బాయ్ ఇలా ఎన్ని చెప్పినా తక్కువే . వయసు పెరిగిపోతున్నా ఇప్పటికీ ఆయనలోని గ్రేస్.. పవర్ రొమాంటిక్ యాంగిల్ ఎక్కడ తగ్గలేదు. విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ నటించిన తీరు.. చూపించిన ఎనర్జీ.. ఏవిధంగా జనాలను ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

కాగా కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ కూడా స్టార్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి నాన్న పేరు ఉపయోగించుకోకుండానే తన సొంత టాలెంట్తో పైకి రావాలని ట్రై చేసిన శృతిహాసన్ ..ఫస్ట్ సినిమా హిట్ కొట్టడానికి చాలా ఏళ్లు గ్యాప్ తీసుకుంది.

ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో మొదటి హిట్టు తన ఖాతాలో వేసుకుంది. అయితే అంతకుముందు తను నటించిన హీరోతో ప్రేమలో పడ్డ శృతిహాసన్.. ఒక హిట్ పడ్డాక తన రూల్స్ ని బ్రేక్ చేస్తూ హద్దులు మీరు కనిపించింది . ఈ క్రమంలోనే కమలహాసన్ అల్లుడు కాబోతున్నాడు ఆ స్టార్ హీరో అంటూ కోలీవుడ్ మీడియా సైతం చెప్పుకొచ్చింది. కొన్నాళ్లు అంతా బాగానే జరిగిన వీళ్ళ ప్రేమాయణం మధ్యలో ఎందుకో బ్రేక్ పడింది . అయితే దానికి కారణం కమల్ హాసన్ అంటూ ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది.

ఆ హీరో క్యారెక్టర్ మంచిది కాదని ..అప్పటికే చాలా మంది అమ్మాయిలతో బ్రేకప్ చెప్పాడని ..అలాంటివాడు నా అల్లుడు అవడం ఇష్టం లేదు అంటూ కమలహాసన్ అతగాడి నిజస్వరూపం శృతిహాసన్ కి తెలిసేలా చేసాడట. దీంతో బ్రేకప్ చెప్పేసిన శృతిహాసన్ మరో బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేసేసింది..అంతేనా అతగాడికి బ్రేకప్ చెప్పింది. ఆ తర్వాత మరో అబ్బాయిని తగులుకుంది. అయితే స్టార్ అల్లుడు కావాల్సిన హీరో మాత్రం ప్రెసెంట్ ఇండస్ట్రీలో సినిమాలు లేక ఆఫర్ లేక ..డైరెక్టర్ల ని ఆఫర్ ఇవ్వండి అని అడుక్కునే స్థాయికి దిగజారి పోయాడు . కమలహాసన్ నిర్ణయం మంచిదే ..ఆయన కూతురు క్యారెక్టర్ గురించి కూడా తెలుసుకోనిఉంటేఆ ఆమె లైఫ్ బాగుండేది అంటున్నారు జనాలు.