తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న ఫ్యామిలీ హీరో జగపతిబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. మొదట్లో విలన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన ఆ తర్వాత హీరోగా మరింత పాపులారిటీని దక్కించుకున్నాడు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ తన నటనతో మరింత పాపులారిటీని దక్కించుకున్న జగపతిబాబు ఇటీవల విలన్ గా.. లెజెండ్ సినిమాతో తనలో ఉన్న సరికొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు.
ఇక ఇప్పుడు వరుసగా విలన్ పాత్రలు చేస్తూ మరింత క్రేజ్ దక్కించుకుంటున్నారు జగపతిబాబు.. మొదటి సారి 1992లో అసాధ్యులు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యి.. ఆ తర్వాత గాయం, జాబిలమ్మ పెళ్లి, దొంగాట వంటి ఎన్నో సినిమాలలో నటించి మరింత పాపులారిటీ దక్కించుకున్నాడు. హీరో కంటే ఎక్కువగా విలన్ పాత్రలతో మరింత గుర్తింపు తెచ్చుకొని మోస్ట్ వాంటెడ్ విలన్ గా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న జగపతిబాబుకు ప్రేక్షకులే కాదు.. సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కూడా అభిమానులుగా మారారు. ఇకపోతే ఇప్పుడు ఈయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక వార్త హాట్ టాపిక్ గా మారింది.
అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా కొన్ని విషయాలను పంచుకుంటూ ఉండే జగ్గూ భాయ్.. ఒక్కోసారి తాను చేసే విన్యాసాలను పంచుకుంటూ మరింత ఆకర్షణగా నిలుస్తున్నాడు. ఇటీవల ఆయన సినిమాల గురించి అప్డేట్లను మరికొన్ని విషయాలను కూడా పంచుకున్నారు. తాజాగా ఒక వీడియో పంచుకున్నారు జగపతిబాబు. అందులో తన 60 ఏళ్ల తర్వాత కాఫీ పెట్టడం నేర్చుకున్నాను అంటూ.. కాఫీ తయారు చేస్తూ చూపించాడు అయితే ఈ వీడియో ఇన్ స్టా వేదికగా పంచుకోవడం జరిగింది.. నిన్నటి వరకు తనకు విస్కీ, బ్రాందీ ,చెత్తాచెదారం అన్ని ఇవే.. కానీ ఇప్పుడు తన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తనకు తాను స్వయంగా కాఫీ చేసుకున్నట్లు వెల్లడించారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది. ఇది చూసిన నెటిజన్ లు.. ఈ వయసులో మీరు కాఫీ పెట్టుకోవడం ఏంటి.. అయ్యో పాపం అంటూ కామెంట్లు చేస్తున్నారు..
https://www.instagram.com/reel/ClwAXDBpqwd/?igshid=YmMyMTA2M2Y=