దేశముదురు భామ హన్సిక మోత్వాని తన చిన్నప్పటి స్నేహితుడైన సొహైల్ కుతురియాతో ఏడు అడుగులు నడిచి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయంం తెలిసిందే.. ఈనెల 4న అనగా ఆదివారం నాడు తన కుటుంబ సభ్యుల, బంధుమిత్రుల సమక్షంలో హన్సిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇక వీరి పెళ్లిని జైపూర్ దగ్గర్లోని ముందోటా పోర్ట్ ప్యాలెస్ లో జరిగింది.
ఈ పెళ్లికి పలువురు సినీ రాజకీయ వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు కూడా హాజరయ్యారు. హన్సిక సోహల్ వివాహానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీరిద్దరూ సింధి సంప్రదాయాల ప్రకారం విరి వివాహం జరిగింది. ఇక ఇప్పుడు హన్సిక సోహెల్ సూఫీ నైట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సూఫీ నైట్ కోసం హన్సిక.. డిజైనర్ అభినవ్ మిశ్రా డిజైన్ చేసిన మూడు లక్షల గోల్డెన్ షరారాను ధరించింది.
ఆ డ్రెస్‌లో హన్సిక అచ్చం గోల్డెన్ బ్యూటీ లాగా అదరగొట్టింది. ఇక ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది హన్సిక. ఆ గోల్డెన్ షరారాలో హన్సికను చూసిన నెటిజెన్స్ అభిమానులు… ఆమెను అలనాటి బాలీవుడ్ సీనియర్ నటి రేఖ సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్ ‘అయినా ఇన్ అంఖోన్ కి మస్తీ’ పాటను గుర్తు చేసుకుంటున్నారు. గోల్డెన్ షరారా సెట్, వెండి టిష్యూ ఆర్గాన్జాతో చేసిన దుప్పట.. హెవీ నెక్ పీసెస్ తో కనిపించిన హన్సిక ఆ లుక్ లో ‘ఉమ్రావ్ జాన్’ రోజులను గుర్తు చేసింది.