పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్ లో `సలార్` ఒకటి. కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో విజయ కిరాగందుర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలయికలో భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇలాంటి తరుణంలో ఫిల్మ్ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు ఉమర్ సంధు సలార్ మూవీపై ఫస్ట్ రివ్యూ ఇచ్ఛేశాడు.
30 సెకండ్స్ నిడివి కలిగిన సలార్ రషెష్ చూశానని చెప్పుకొచ్చిన ఉమర్ సంధు.. `చెప్పడానికి మాటల్లేవు. గూస్ బంప్స్ వచ్చేశాయి. 2023 లో ప్రభాస్ బౌన్స్ బ్యాక్ అవుతున్నారు` అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈయన ట్వీట్ కాస్త నెట్టింట వైరల్ గామారింది. ఉమర్ సంధు వ్యాఖ్యలతో సలార్ ఓ రేంజ్ ఉండబోతోందని, డార్లింగ్ ఫ్యాన్స్‌కు పూనకాలు ఖాయమని సినీ ప్రియులు భావిస్తున్నారు.