నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణిని ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ప్రస్తుతం ఈమె హెరిటేజ్ గ్రూప్‌కు మేనేజింగ్ డైరెక్టర్ గా ఆ సంస్థను ముందుకు తీసుకువెళ్తుంది. తాజాగా ఈమె బైక్ ట్రావెలర్ గా తాను చేసిన అడ్వెంచర్ల గురించి చెప్తూ ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో నారా బ్రాహ్మణి తాను లేహ ప్రాంతానికి వెళ్ళినప్పుడు తాను అక్కడ చేసిన బైక్ రైడింగ్ గురించి చెబుతూ.. అక్కడ నేను ఉదయం పూట లేచి అక్కడి నుంచి థిక్సే మాంటెస్సరీకి బయల్దేరామని, అక్కడే నా టీఫీన్, మెడిటేషన్ కూడా చేయాల్సి ఉందని చెప్పుకొచ్చారు.
వీటితోపాటు ఆ బైక్ జర్నీలో తన స్పిరిట్యువల్ ఎక్స్ పీరియెన్స్ గురించి కూడా చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన వారందరూ ఈమెలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆ వీడియో కింద నారా బ్రాహ్మణి గ్రేట్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియోతో నారా బ్రాహ్మణి సోషల్ మీడియాలో హాట్‌టాపిక్ గా మారింది.
నారా ఫ్యామిలీ మీద సోషల్ మీడియాలో ఎలాంటి ట్రోలింగ్ జరుగుతుందో అందరికీ తెలిసిందే. మరి దారుణంగా లోకేష్ పై ఎలాంటి కామెంట్లు వస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అయితే బ్రాహ్మణి మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియా వార్తల్లో నిలవలేదు. ఎవరేమన్నా ఎంత ట్రోల్స్ చేసినా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది.
హెరిటేజ్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ మహిళా వ్యాపారవేత్తగా బ్రాహ్మణి ఎన్నో విజయాలు సాధించింది. ఇప్పుడు తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు చూపించింది. బైక్ ట్రావెలర్ గా ఇరగదీసిందంటూ, నందమూరి బిడ్డ మజాకా అంటూ నెటిజన్లు ఆ వీడియో పై కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు. అలాగే కొందరు తండ్రికి ధీటైన తనయ అంటూ ప్రశంసిస్తున్నారు.
నారా బ్రాహ్మణి వదినమ్మ..
ఒక ప్రొఫెషనల్ బైకర్…
Passionate Travalleryes మీరు విన్నది, చూసేది నిజమే..
జావా యజ్ది స్పోర్ట్స్ బైక్ మీద లేహ్ – లద్దక్ లాంటి హిల్ స్టేషన్ ఏరియా లో ట్రావెల్ చేశారు.వాళ్ల ట్రావెల్ experiance ఎలా ఉందో వాళ్ల మాటల్లోనే చూసేయండి😍#HOPEKolli
1/4 pic.twitter.com/SNRuAwleAp— KOLLI DURGA VARA PRASAD (@JaiKolliS_Lolli) November 30, 2022