టాలీవుడ్ నట సిం హం నందమూరి బాలయ్య కోపం ఎక్కువ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఉన్నది ఉన్నట్టు ముఖానే మాట్లాడే బాలయ్య అంటే సినిమా ఇండస్ట్రీలో చాలామందికి భయం. టంగ్ స్లిప్ అయితే ఎక్కడ మాట పడాలో ఎక్కడ కోపానికి గురవ్వాలో అని భయపడుతూ ఉంటారు . కాగా రీసెంట్గా అలా బాలయ్య కోపానికి గురైంది స్టార్ డాటర్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . మనకు తెలిసిందే బాలయ్య అఖండ సినిమాతో క్రేజీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.
ప్రజెంట్ గోపీచంద్ మల్లినేని డైరెక్షన్లో తన 107వ సినిమాలో నటిస్తున్నాడు . సంక్రాంతి కానుకగా ఈ సినిమా ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ కానుంది. అంతేకాదు ఈ సినిమాలో ఫస్ట్ టైం బాలయ్య సినిమా హీరోయిన్గా నటిస్తుంది శృతిహాసన్ . అంతేకాకుండా కీలకపాత్రలో నటిస్తుంది స్టార్ డాటర్ వరలక్ష్మి శరత్ కుమార్ . ఈ సినిమాలో హీరోయిన్ శృతిహాసన్ పాత్ర కంటే వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రే కీలకంగా ఉంటుంది అంటూ మేకర్స్ దగ్గర నుంచి సమాచారం లీకై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .
కాగా ఈ క్రమంలోనే బాలయ్య – వరలక్ష్మి శరత్ కుమార్ బాగా క్లోజ్ అయినట్టు కూడా సినీవర్గాల నుంచి సమాచారం అందుతుంది . ఇదే చనువుతో బాలయ్య అనీల్ రావిపూడి డైరెక్షన్లో నటించబోయే సినిమాలోనూ సరదాగా నటించమని అడిగారట . ఈ క్రమంలోనే వరలక్ష్మి శరత్ కుమార్ సైతం నా కాల్ షీట్స్ అన్ని ఫీల్ అయిపోయాయి అంటూ సరదాగానే హెడ్ వెయిట్ తో ఆన్సర్ ఇచ్చిందట. ఈ క్రమంలో బాలయ్య కూడా ఫన్నీ గానే తనదైన స్టైల్ లో కౌంటర్ వేసినట్లు తెలుస్తుంది .
” బాలయ్య కే ఫస్ట్ ప్రియారిటీ.. ఆ తర్వాత ఎవరైనా.. లేకపోతే దబిడి దిబిడే” అంటూ స్వీట్ కౌంటర్ వేశారట . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఏది ఏమైనా సరే బాలయ్య లాంటి సీనియర్ హీరో పక్కన టాలెంట్ ఉన్న వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తే ఆమెకే ఇంకా మంచిది అంటూ నందమూరి ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . చూడాలి మరి బాలయ్య – అనిల్ రావిపూడి సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తుందో లేదో..?