మళ్ళీ గర్భం దాల్చిన కాజల్ అగర్వాల్..ఫోటోలు వైరల్..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ కాజల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . తనదైన స్టైల్ లో నటిస్తూ టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ లో అవకాశాలు అందుకొని హీరోయిన్ నుంచి స్టార్ హీరోయిన్గా మారి ..తన అందానికి మంత్రముగ్ధులను చేసేసింది . లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో సినీ తెరకు పరిచయమైన కాజల్ అగర్వాల్ ..మొదటి సినిమాతోనే క్లాసిక్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది . ఈ సినిమాలో కాజల్ పెర్ఫార్మెన్స్ కు స్టార్ హీరోల సైతం ఫిదా అయ్యారు. ఇక తర్వాత రెండో సినిమాకి మెగా పవర్ స్టార్ తో అవకాశం అందుకుని మగధీర లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది .

ఈ సినిమా హిట్ తో కాజల్ పేరు సోషల్ మీడియాలో సినీ ఇండస్ట్రీలో మారుమ్రోగిపోయింది. మగధీర సినిమా ఏమని హిట్ అయిందో కానీ అప్పటినుంచి కాజల్ వెనక్కి తిరిగి చూసుకొనే అవకాశం లేకుండా పోయింది . వరుసగా ఆఫర్లు రావడం ..అందులోనూ టాలెంటెడ్ హీరోయిన్గా పేరు సంపాదించుకోవడంతో ..కాజల్ ఊపిరాడనంత బిజీగా షెడ్యూల్ బుక్ చేసుకుంది. బాలీవుడ్ లోనూ కోలీవుడ్ లోనూ టాలీవుడ్ లోనూ ఆల్మోస్ట్ ఆల్ అందరి సీనియర్ – జూనియర్ హీరోలతో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది .

అంతే కాదు రెమ్యూనరేషన్ విషయంలో చాలా పక్కాగా ఉండే కాజల్ అగర్వాల్ ..సినిమా షూటింగ్ విషయంలో చాలా డెడికేషన్ తో వర్క్ చేసేదట. అందుకే ఆమెతో బిగ్ స్టార్స్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఇష్టపడేవాళ్లు . కాగా కెరియర్ పిక్స్ లో ఉన్నప్పుడే గౌతమ్ కిచ్చులును పెళ్లి చేసుకున్న కాజల్.. అంతే త్వరగా నీల్ కిచ్చులుకు జన్మనిచ్చింది .

ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ కోసం ట్రై చేస్తున్న కాజల్ అగర్వాల్ మరోసారి గర్భం దాల్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . దానికి కారణం రీసెంట్గా షేర్ చేసుకున్న ఫొటోస్ లో బేబీ బంప్ తో కనిపించడమే . ప్రెగ్నెన్సీ తర్వాత బాగా సన్నబడిన కాజల్ మళ్ళీ పొట్ట పెరగడంతో ఆమె మరోసారి గర్భం దాల్చినట్టు.. సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . మరి ఇది ఎంతవరకు నిజమో కాజల నోరు తెరిచి చెప్తేనే తెలుస్తుంది..!!