భారీగా `ధ‌మాకా` బిజినెస్.. హిట్ కొట్టాలంటే ర‌వితేజ ఎంత రాబ‌ట్టాలి?

`ఖిలాడి`, `రామారావు ఆన్ డ్యూటీ` వంటి ఫ్లాపుల అనంత‌రం మాస్ మ‌హారాజా ర‌వితేజ నుంచి రాబోతున్న చిత్రం `ధ‌మాకా`. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీ‌లీల హీరోయిన్ గా న‌టించింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించాడు.

డిసెంబ‌ర్ 23న ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తూ డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ను అందించ‌బోతున్నాడు. ఇక‌పోతే రెండు ఫ్లాపుల త‌ర్వాత కూడా ర‌వితేజ న‌టించిన ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌ర‌గ‌డం విశేషం. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా థియేట్రిక‌ల్ హ‌క్కులు రూ. 18.30 కోట్ల రేంజ్ లో అమ్ముడు పోయాయి. ఏరియాల వారి బిజినెస్ లెక్కలను గమనిస్తే…

నైజాం: 5.5 కోట్లు
సీడెడ్: 2.5 కోట్లు
ఆంధ్రా: 8 కోట్లు
————————————-
ఏపీ+తెలంగాణ‌ మొత్తం= 16.00 కోట్లు
————————————-

క‌ర్ణాట‌క‌+ రెస్టాప్ ఇండియా+ ఓవ‌ర్సీస్‌: 2.30 కోట్లు
——————————————–
వ‌ర‌ల్డ్ వైడ్ టోట‌ల్ బిజినెస్ = 18.30 కోట్లు
——————————————–

కాగా, కొన్ని ఏరియాలలో సినిమా ఓన్ గా రిలీజ్ కానుండగా.. ఓవరాల్ ఈ చిత్రానికి రూ.18.30 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. దీంతో హిట్ కొట్టాలంటే ర‌వితేజ రూ. 19 కోట్లు రాబ‌ట్టాల్సి ఉంది. మ‌రి ఈ టార్గెట్ ను ర‌వితేజ రీచ్ అవుతాడా..లేదా.. అన్న‌ది చూడాలి.