టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత ఇటీవలే మాయోసైటిస్ వ్యాధి బారిన పడడంతో ఈమె హవా కాస్త తగ్గిందని చెప్పవచ్చు. ఇటీవల సమంత అనారోగ్య సమస్య కారణంగా సినిమా షూటింగులు కూడా వాయిదా పడుతూ వస్తోంది. దీంతో సమంత ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే సినిమాలకు గుడ్ బై చెప్పేసిందనే వార్తలు చాలా వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇప్పుడు ఇంతలోనే సోషల్ మీడియాలో తాను ఆరోగ్యంగానే ఉన్నానని నిరూపించే కొన్ని ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్ గా మారుతున్నాయి.
సమంత ఈ ఫోటోలలో కాస్త కొంటెతనాన్ని కూడా ప్రదర్శించడానికి చూస్తుంటే తను కోలుకుందని భావన కనిపిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే విజయ్ దేవరకొండ ఖుషి సినిమా చిత్రీకరణ లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇంతలోనే మరో ఊహించని ట్విస్ట్ షాకిస్తోంది. సమంత తదుపరి ఫ్యామిలీ మ్యాన్ రాజ్ అండ్ డీకే సారధ్యంలో క్రేజీ వెబ్ సిరీస్ లో నటించాల్సి ఉండగా ఈ ప్రాజెక్టు నుంచి ఆమె వైదొలిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం తాజాగా amazon రివీల్ చేసిన ఒక పోస్టర్లు వరుణ్ ధావన్ సహా సాంకేతిక నిపుణుల వర్గాలు వెల్లడయ్యాయి కానీ ఎక్కడ సమంత ప్రస్తావన తీసుకురాలేదు
ప్రస్తుతం అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతూ ఉండడంతో తను స్వచ్ఛందంగా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ రాజు అండ్ డీకే లాంటి టాలెంటెడ్ ఫిలిం మేకర్స్ వల్లనే సమంత పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకుందని చెప్పవచ్చు.తదుపరి వెంటనే వారితో కలిసి సమంత తన సిరీస్ ని ప్రకటించగానే ఉత్కంఠంగా కలిగింది.కానీ ఇంతలో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసిన తాజా పోస్టర్లు సమంతకు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు.. దీంతో సమంత అభిమానులు చాలా నిరుత్సాహ పడుతున్నారు. మరి ఎలాంటి అప్డేట్ తెలియజేస్తారో చూడాలి మరి.