చిరు, వెంకీ, నాగ్ ల ‌భారీ మల్టీస్టారర్ అందుకే ఆగిపోయిందా… కారణం ఎవరు..?

టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ ఎప్పటి నుంచో నడుస్తుంది. మన తెలుగు సీనియర్ దివంగత నటులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ దగ్గర నుంచి సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు వరకు ఎన్నో మల్టీస్టారర్ సినిమాలలో నటించారు. ఆ తర్వాత తరం హీరోలైన బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ మాత్రం ఎప్పుడు కలిసి నటించిన సినిమా లేదు. మధ్యలో కొంతకాలం ఈ సినిమాలుకు గ్యాప్ వచ్చిన మళ్లీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా దగ్గర నుంచి టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ మొదలైంది.

Who is the superstar in Telugu cinema industry? - Quora

ఈ సంవత్సరం వచ్చిన భారీ మల్టీస్టారర్ సినిమా ‘త్రిబుల్ ఆర్’ లో ఏకంగా టాలీవుడ్‌లో అగ్ర హీరోలుగా కొనసాగుతున్న రామ్ చరణ్- ఎన్టీఆర్ కలిసి నటించారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఎంతటి ఘ‌న విజ‌యం సాధించిందో మనందరికీ తెలిసిందే. అయితే గతంలో కూడా మన టాలీవుడ్ సీనియర్ హీరోలతో భారీ మల్టీస్టారర్ సినిమా సెట్స్ పైకి వెళ్ళకముందే ఆగిపోయింది. 2002లో చిరంజీవి ఇంద్ర సినిమా తర్వాత తెలుగులో ఓ భారీ మల్టీస్టారర్ సినిమాకు దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు ప్లాన్ చేశారు.

Nagarjuna hug & Venkatesh Kiss for Chiranjeevi

టాలీవుడ్ అగ్ర హీరోల‌లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లతో ఈ భారీ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు. ఆ సినిమాని కూడా రాఘవేంద్రరావు తన 100వ సినిమాగా చరిత్రలో నిలిచిపోయేలా ఆ సినిమాను రూపొందించాలనుకున్నాడు. అప్పట్లో ఈ మల్టీ స్టార్ సినిమాకు చిన్ని కృష్ణ కథ కూడా రెడీ చేసి రాఘవేంద్ర‌రావు కి అందజేశాడు. ఆ సినిమాకు ‘త్రివేణి సంగమం’ అనే టైటిల్‌ని కూడా ఖరారు చేశారు. ఈ సినిమాను ;మూడు హిందూ పుణ్యక్షేత్రాల నేపథ్యంలో’ కథ కథనాన్ని కూడా రెడీ చేశారు.

K Raghavendra Rao's multi-starrer

అందరూ ఓకే అనుకున్న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళటమే తరువాయి.. ఈ భారీ మల్టీస్టారర్ సినిమాని కూడా తెలుగులో ఉన్న మూడు భారీ నిర్మాణ సంస్థలు నిర్మించడానికి సిద్ధమయ్యాయి.. సురేష్ ప్రొడక్షన్స్, గీత ఆర్ట్స్, వైజయంతి మూవీస్. కానీ ఈ సినిమా క్లైమాక్స్, ఇతరత్రా కొన్ని సన్నివేశాలు కుదరకపోవడం వల్ల‌ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళకముందే మధ్యలోనే ఆగిపోయింది. అలా ఈ ముగ్గురి హీరోలను ఓకే తెరపై చూడాలన్న ప్రేక్షకుల కల మాత్రం నెరవేరలేదు. ఒకవేళ ఈ సినిమాను దర్శకేంద్రుడు తెరకెక్కిస్తే ఆది తెలుగు సినిమా చరిత్రలోనే మైలురాయి సినిమాగా మిగిలిపోతుంది అనడంలో సందేహం లేదు.