2022 నిర్మాతలకు లాభాలు తెచ్చిన చిత్రాలు ఇవే..!!

ఈ ఏడాది మరో కొద్ది రోజుల్లో ముగియానున్నది. ఏడాది తెలుగు చిత్రాలు పలు బ్లాక్ బాస్టర్ చిత్రాలుగా మిగిలాయి. అలా సౌత్ లోనే ఎన్నో చిత్రాలు విడుదలై నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చి పెట్టిన సినిమాలు ఉన్నాయి. టాలీవుడ్ లో విడుదలైన వాటి గురించి ఇప్పుడు పూర్తిగా మనం తెలుసుకుందాం.

1). బింబి సార:
కళ్యాణ్ రామ్ హీరోగా ఈ చిత్రంలో నటించారు ఈ సినిమాకి డైరెక్టర్ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించారు ఈ సినిమా కొన్ని బయర్లకు దాదాపుగా రూ.21.92 కోట్ల లాభాన్ని అందించింది.

2). సీతారామం:
దుల్కర్ సల్మాన్,మృనాల్ ఠాగూర్ ,రష్మిక కలిసి నటించిన ఈ చిత్రం అనుకోని విధంగా సక్సెస్ సాధించింది. ఈ చిత్రం దాదాపుగా రూ.29.19 కోట్ల లాభాన్ని అందించింది.

3). కార్తికేయ-2:
నిఖిల్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో ఈ చిత్రం విడుదల అయింది. ఈ సినిమా దాదాపుగా రూ.40 కోట్ల లాభాన్ని అందించింది.

4). మసుదా:
ఈ సినిమా మొత్తం దాదాపుగా రూ .4కోట్ల రూపాయల లాభాన్ని అందించినట్లు తెలుస్తోంది.

5). గాలోడు:
సుధీర్ హీరోగా ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమా రూ.2.5 కోట్ల లాభాన్ని అందించింది.

6). యశోద:
సమంత లేడీ ఓరియంటెడ్ చిత్రంగా ఈ చిత్రంలో నటించింది ఈ సినిమా దాదాపుగా రూ.2 కోట్ల రూపాయలు లాపాన్ని అందించింది.

7). హిట్-2:
అడవి శేషు హీరోగా డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు ఈ చిత్రంతో నానికి రూ.4 కోట్ల లాభం వచ్చినట్లు తెలుస్తోంది.

8).డి జె టిల్లు:
సిద్దు జొన్నల గడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి రూ.7.57 కోట్ల లాభాన్ని అందించింది.

9).RRR:
ఎన్టీఆర్ , రామ్ చరణ్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం రూ.108 కోట్ల లాభాన్ని అందించింది.

10). మేజర్:
ఈ చిత్రంలో అడవి చేసే హీరోగా నటించారు ఈ చిత్రంతో మహేష్ బాబుకి , బయ్యర్లకు రూ.17.62 కోట్ల లాభాన్ని అందించింది.