మహేశ్ సినిమాలో బన్నీ.. ఇది కదా ఫ్యాన్స్ కోరుకునేది..ఇప్పుడు అసలైన మజా..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో మల్టీ స్టార్ సినిమాలు ఎక్కువైపోయాయి. సింగల్ హీరోగా నటించి హిట్ కొట్టడం లో ఉన్న మజాకంటే .. మల్టీస్టారర్ మూవీలో నటించి జనాలను ఎంటర్ టైన్ చేయడమే మంచి పద్ధతి అంటూ స్టార్ హీరోల సైతం మల్టీస్టారర్ మూవీస్ కి ఎక్కువగా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీసెంట్ గానే ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్ – తారక్ దాన్ని మరోసారి ప్రూవ్ చేశారు .

కాగా ఇదే కోవాలో మరో ఇద్దరు స్టార్ హీరోస్ తెరపై కనిపించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు – మాటలు మంత్రి కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రెండో షెడ్యూల్ స్టార్ట్ కాబోతుంది . ఈ సినిమాలో పూజ హెగ్డే మొదటి హీరోయిన్గా నటిస్తుంది. రెండో హీరోయిన్గా శ్రీలీల పేరు గట్టిగా వినిపిస్తుంది .

కాగా ఈ సినిమాలో ఐకానిక్ స్టార్ బన్నీ కూడా ఒక గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు అంటూ తాజా అప్డేట్ ప్రకారం తెలుస్తుంది . మనకు తెలిసిందే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కి బన్నీకి ఎంతటి మంచి ఫ్రెండ్షిప్ ఉందో . తెర పై వీళ్ల కాంబో అదుర్స్ అనే చెప్పాలి. కాగా ఫ్రెండ్షిప్ కారణంగానే మహేష్ సినిమాలో నటించడానికి బన్నీ యాక్సెప్ట్ చేసినట్లు ఓ న్యూస్ తెగ హల్చల్ చేస్తుంది. అయితే ఇప్పటివరకు దీని పై అఫీషియల్ ప్రకటన అయితే రాలేదు. ఒకవేళ ఈ వార్త నిజమే అయితే ఫాన్స్ కి ఇంతకన్నా గుడ్ న్యూస్ మరొకటి ఉండదు అంటున్నారు ఫ్యాన్స్. ఇద్దరు స్టార్ హీరోలను ఒకే తెరపై చూస్తే ఆ కిక్కే వేరు అంటూ బన్నీ – మహేష్ ఫ్యాన్స్ ఆ కాంబో సెట్ అవ్వాలని కోరుకుంటున్నారు.

Share post:

Latest