రామ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో.. బోయపాటి స్కెచ్ అదిరిపోయిందిగా..!

గత సంవత్సరం బాలకృష్ణకు అఖండ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను.. ప్రస్తుతం యంగ్ హీరో రామ్ తో తన తర్వాత సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు అవ్వగా ఎంతో శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో రామ్ కు జంటగా యంగ్ హీరోయిన్ శ్రీ లీల నటిస్తుంది. అఖండ లాంటి సూపర్ హిట్ తరువాత బోయ‌పాటి నుంచి వస్తున్న సినిమా కావడంతో టాలీవుడ్ లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Boyapati Srinu to avoid these mistakes!

ఆ అంచనాలకు తగ్గట్టు బోయపాటి కూడా ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాని రామ్ కెరియర్ లోనే మొదటిసారిగా పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగానే నటీనటుల ఎంపిక కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.

Crazy Mass Combo: Boyapati Sreenu, Ram Pothineni & Srinivasaa Chhitturi Come Together For Pan-Indian Film

ఈ సినిమాలో ఓ బాలీవుడ్ హీరో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడట.. ఆ హీరో మరెవరో కాదు.. బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి. ఈ సీనియర్ హీరో ఈ సినిమాలో నటిస్తే ఈ సినిమాకు బాలీవుడ్ లో కూడా సూపర్ క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో మరో బాలీవుడ్ అందాల భామా ఊర్వశి రౌటేలా అదిరిపోయే స్పెషల్ సాంగ్ లో నటిస్తుంది.

రామ్ ఇమేజ్‌కు అదిరిపోయే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా ఇలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. వారియ‌ర్ సినిమాత నిరాశ ప‌రిచిన రామ్ ఇప్పుడు బోయ‌పాటి సినిమాపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాడు.